World Twins Day 2026: సినిమాల్లో డబుల్ రోల్స్ కనిపించే పాత్రలు చాలా ఆసక్తికరం గా ఉంటాయి. ఇక కవల పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళను అందరూ గమనిస్తుంటారు. ఇక కవల పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళ బంధువులు ఒకరిని మరొకరు పోల్చు కోవటానికి ఇబ్బందిపడతారు. ఏది ఏమైనా కవలల్లో ఒక ప్రత్యేకత ఇద్దరి మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే పోలికలు. ఇక ఒకేసారి 100 మంది కవల పిల్లలను చూస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి దృశ్యమే ఆదివారం రోజున ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కనిపించింది.
Read Also: Laddu Controversy : రాష్ట్రంలో లడ్డూ తప్ప ఇంకే సమస్య లేదా ? – అంబటి రాంబాబు
పాఠశాలల్లో మొక్కలు నాటారు
ఒకే పోలిక, ఒకే రూపంతో ఉన్న సుమారుగా వంద మంది కవలలు తిరుపతిలో సందడి చేశారు. అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ కవలలు సందడి చేశారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయం ఇందుకు వేదికైంది.ఈ కార్యక్రమానికి హాజరైన జనం ఇంతమంది కవలలను ఒకచోట చూసి ఆశ్చర్యపోయారు.
ఒకే రూపం, ఒకే డ్రస్సుతో ఉన్న చిన్నారులు, యువతను చూసి ఆశ్చర్యపోయారు. కార్యక్రమంలో భాగంగా కవలలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు వచ్చినవారిని ఆకట్టుకున్నాయి. కేవలం వేడుకలకే కాకుండా, పాఠశాలల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల కవలలు తమ బాధ్యతను చాటుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: