📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

Workers Welfare : కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది – మంత్రి వి. సుభాష్

Author Icon By Shravan
Updated: August 6, 2025 • 2:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ (Workers Welfare) : భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికుల, వారి కుటుంబాల సంక్షేమమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక, కర్మాగార, బాయిలర్స్. వైద్య బీమా సేవల శాఖామంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) భవన నిర్మాణ. ఇతర కార్మికుల సంక్షేమశాఖ కార్యాలయంలో కార్మిక సంక్షేమ బోర్డు సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి హజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల రక్షణకు కార్మిక శాఖ అనేక చర్యలు తీసకుంటుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికులు ఊచకోతకు గురయ్యారని, కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయారంగాల కార్మికుల సంక్షేమంకు పెద్దపీట వేశామన్నారు. అందులో భాగంగానే ప్రతి పట్టణంలో అడ్డాకూలీగా రోడ్లపై గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి రాకుండ వారి కోసం పక్కా భవనాలను నిర్మించాలని ప్రతిపాదనను బోర్డు సమావేశంలో తీసుకున్నామన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఇంటిగ్రేటేడ్ కార్మిక భవనాలను నిర్మించనున్నామని, క్రమంగా ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశానమన్నారు.

అంతేకాకుండ కార్మకులు, వారి కుటుంబ సభ్యులు నైపుణ్యం పెంచే విధంగా వారికి నైపుణ్య శిక్షణ అందించనున్నామన్నారు. అలాగే ప్రతి ప్యాక్టరీలో ఒక సేఫ్టీ అధికారిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని, దీంతో ప్రమాదాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడతాయన్నారు. ఇందుకోసం యూనివర్సిటీలతో ఎంఓయు చేసుకున్నామని వివరించారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara ChandraBabu Naidu) అధికారం చేపట్టగానే పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని, పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారని, దీంతో మన రాష్ట్రంలో కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఏడాదికి 50 రోజుల కంటే ఎక్కువ పనిచేసేవారిని కార్మికులుగా గుర్తిస్తున్నామని, నరేగా కార్మికులను గుర్తించడంతో రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది కార్మికుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో సెస్స్ వసూళ్ల శాతం పెంచటం దృష్టి సారించనున్నామని, వారి రక్షణ కోసం సెస్స్ వసూళ్లపై దృష్టిసారించామన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/ap-state-haj-committee-chairman-sheikh-hassan-bhasha-thanked-the-chief-minister/andhra-pradesh/526866/

AP Coalition Government Breaking News in Telugu Labour Rights Andhra Pradesh Latest News in Telugu Minister V Subhash Telugu News Worker Benefits 2025 Workers Welfare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.