ఈ మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచా రాలు ఈ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా నిలుస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో మహిళ లపై జరుగుతున్న అమానుష దుర్ఘటనలు, లైంగిక వేధిం పులు చూస్తూవుంటే కేంద్ర, రాష్ట్రవ్యాప్తంగా మహిళల భద్రత ఇక ప్రశ్నార్థకమేనా అనే అనుమానం పెనుభూతమై మన హృదయాల్ని తీవ్రంగా కలిచి వేయకమానదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ పేపర్ తిరిగేసిన ఏదో ఒక మూలన మహిళలపై, అభం, శుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న దారుణాలకు సంబంధించిన వార్తలే మనకు తరచుగా కళ్లకు కడుతూ ఉంటాయి. దర్శనం ఇస్తూ ఉంటాయి. మన జతి పిత, అహింసవాది గాంధీ మహాత్ముడు సెలవిచ్చినట్లుగా అర్థరాత్రి మహిళలు ఓంటరిగా స్వేచ్ఛగా తిరుగాడినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం లభించినట్లు. అయితేఎందరో మన స్వాతంత్ర్య సమరయోధులు తమ తమ ప్రాణత్యాగా లతో, ఎనలేని దేశభక్తితో మనకు బ్రిటిష్ వారి దాస్య శృం ఖలాల నుంచి బంధవిముక్తులు గావించి స్వేచ్చ స్వాంతం త్ర్యాలు లభించేటట్లు చేసి నేటికి దాదాపు 78 వసంతాలు కావస్తున్నప్పటికీ ముఖ్యంగా ఇంకను మహిళలకు భద్రత (Safety of women) అనేది గగన కుసుమంగా పరిణమించడం అత్యంత దిగ్భ్రాంతికరం, ఆందోళనకరమైన విషయం. కేంద్ర ప్రభుత్వం వారు మహిళల భద్రత కోసమని ఎన్ని కఠిన, దిశ చట్టాల వంటివి తీసుకువచ్చినా మహిళలపై జరుగుతున్నఅత్యాచా రాల పరంపర నిరంతరం కోనసాగుతుండటం ముఖ్యంగా ఆడపిల్లలు గల ప్రతి ఒక్క తల్లిదండ్రులలో అత్యంత తీవ్రస్థాయిలో భయాందోళన రేకెత్తించే విషయం అనే మాట సత్యదూరం కాదు.
Read Also: http://Rain Alert: భారీ వర్షాలతో అతలాకుతలం అయినా తమిళనాడు
పోలీస్, న్యాయవ్యవస్థ వారు మహిళల పై జరుగుతున్న ఇలాంటి అరాచకాలు, దౌర్జన్యలకు అడ్డు కట్ట వేసేందుకు తమ శక్తి వంచన లేకుండా అవిరళ కృషి చేస్తున్నప్పటికీ, మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్న మానవ మృగాలను చాలా తీవ్రస్థాయిలో కఠినంగా శిక్షి స్తున్నప్పటికీ అవి బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోతుండటం అత్యంత దురదృష్టకరం. ఏది ఏమైన కేవలం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, పోలీసుశాఖ, న్యాయవ్యవస్థ వారే కాకుండా ప్రతి ఒక్క మానవతావాదులు, మానవహక్కుల సంఘాల వారు, మహిళల భద్రతను (Safety of women) కోరుకునే ప్రతిఒక్కరూ కూడా మహిళలపై జరుగుతున్న ఇలాంటి అమానుష అత్యా చారాలు, లైంగిక దాడులను నియంత్రించే విషయంలో తమ వంతుగా భాగస్వాములై మహిళల మాన, ప్రాణాలకు ఒక రక్షణ కవచంలా నిలబడి తీరాలి. అంతేగాకుండా గ్రామ, గ్రామాన, నగరాలలోని వీధి వీధిన మహిళలపై జరుగు తున్న అఘాయిత్యాలపై చాలా తీవ్రస్థాయిలో ఉద్యమించేలా మహిళ అభ్యున్నతి కోరే సంఘాలు ఏర్పడితే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, దౌర్జన్యాలకు, అరాచకాలకు కొంతలో కొంతైన అడ్డుకట్ట వేయవచ్చు. ఏమైనా రానున్న రోజుల్లోనైనా కేంద్ర, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ చేకూరి, వారిలో నెలకొన్న అభద్రతాభావం తెరమరుగై వారి జీవితాలు సుఖ, శాంతి, సంతోషాలతో వర్ధిల్లాలని యావత్తు భారత దేశ ప్రజానీకం మనసా, వాచా కర్మణా కోరుకుందాం. అలాగే యావత్తు మహిళలోకం ఐకమత్యమే మహాబలం అనే మన పెద్దల నీతి సామెతకు లోబడి అత్యంత ధైర్య సాహసాలతో ఆనాటి ప్రముఖ స్వా తంత్య్ర సమరయోధురాలు, సాహస నారిమణీ, వీరనారి అయిన ఝాన్సీ లక్ష్మీ బాయ్లా ముందుకు దూసుకెళ్లి ఈ సమాజంలో తమపై జరుగుతున్న దారుణ అకృత్యాలను పూర్తి స్థాయిలో నియంత్రించేలా, రక్షణ చేకూరేలా చేయమని ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై, పోలీసు, న్యాయ వ్యవస్థపై రాష్ట్ర మహిళా లోకం యావత్తు ఒకే త్రాటిపై నిలిచి చాలా తీవ్రస్థాయిలో వారిపై ఒత్తిడి తీసుకువచ్చి తమ హక్కులను కాపాడుకోవాలి. వాటి అమలుకు అత్యంత చిత్తశుద్ధితో ప్రయ త్నం చేయాలి. జయ జయహో మహిళాలోకం, వారి హక్కులు మరో పది కాలాల పాటు వర్ధిల్లాలి. వారు తమ ఉనికిని చాలా గొప్పగా చాటాలి!
-బుగ్గన మధుసూదనరెడ్డి
మహిళల భద్రత ఎందుకు సమస్యగా ఉంది?
భారతదేశంలో మహిళా భద్రత ఆశ్చర్యకరంగా, రోజుకు 88 అత్యాచార కేసులు భయంకరమైన రేటుతో నమోదయ్యాయి. ఇంకా, పని ప్రదేశంలో వేధింపులు, మానవ అక్రమ రవాణా మరియు వరకట్న మరణాలు మహిళల భద్రతకు ముప్పు కలిగిస్తూనే ఉన్నాయి . ఏప్రిల్ 2025 నాటికి, భారతదేశంలో మహిళలపై నేరాలకు సంబంధించిన తాజా డేటా 2022 సంవత్సరం వరకు అందుబాటులో ఉంది.
మహిళల భద్రతను ఎలా నియంత్రించాలి?
మహిళలు వేధింపులు లేదా హింసను ఎదుర్కొనే పరిస్థితులను గుర్తించి సురక్షితంగా జోక్యం చేసుకోవడానికి సమాజ ఆధారిత కార్యక్రమాలు ప్రజలకు శిక్షణ ఇవ్వాలి. లింగ ఆధారిత హింసను నివారించడంలో పురుషులు మరియు మహిళలు తమ పాత్ర గురించి అవగాహన కల్పించడం వల్ల దుర్వినియోగం మరియు వివక్షత సంఘటనలను గణనీయంగా తగ్గించవచ్చు.
Read hindi news : http://hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: