📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Women protection: మహిళలు, బాలల రక్షణ కోసం సహాయ కేంద్రాలు

Author Icon By Saritha
Updated: November 15, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

24గంటలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు

విజయవాడ : మహిళలు, బాలల భద్రత, రక్షణ కోసం సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు(Women protection) రోజంతా అంటే 24గంటలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మహిళల భద్రత, రక్షణ కోసం రోజులో 24 గంటలూ ఆయా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. గృహహింసకు గురైనా, దాడులు జరిగినా బాధితులు ఆయా కేంద్రాలను సంప్రదిస్తే వైద్య సాయంతోపాటు పునరావాసం కల్పిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖ(Health Department) అధికారులను సమన్వయం చేసుకుంటూ బాధితులకు చేయూతనిస్తారు. మహిళలను కట్నం కోసం వేధించడం, శారీరక, మానసిక వేధింపులకు పాల్పడిన సందర్భంలో బాధితులు 181 నంబరుకు ఫోన్ చేయొచ్చు.

Read also: రెండో వార్షికోత్సవానికి రేవంత్ సర్కార్ సిద్ధం

Women protection

బాధితులను ఆదుకునేందుకు అన్ని శాఖల సమన్వయ చర్యలు

రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ కార్యాలయంలోని(Women protection) అధికారులు, సిబ్బంది వివరాలు నమోదు చేసుకుని బాధితులను ఆదుకునేలా చర్యలు చేపడతారు. కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుంటారు. ఈ క్రమంలో వివిధ రూపాల్లో వారిని బెదిరిస్తే 1930 నంబర్ ను ఫోన్ చేసి సాయం కోరవచ్చు. పోలీసు అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేస్తారు. ఆన్లైన్లో ఆర్థిక మోసాలకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేస్తే బ్యాంకుఖాతా నుంచి నగదు లావాదేవీలను నిలిపేస్తారు. న్యాయస్థానాల్లో కేసులకు సంబంధించి 15100 నంబరుకు ఫోన్చేసి న్యాయసేవలు పొందవచ్చు. కోర్టుల్లో న్యాయవాదులను పెట్టుకోలేని మహిళలకు ప్రభుత్వ న్యాయవాది ద్వారా చేయూత నిస్తారు. బాలలతో వెట్టిచాకిరీ చేయించడం, పారిశ్రామిక, కర్మాగారాల్లో పనుల్లో పెడితే వారిని రక్షి ంచేందుకు హెల్ప్ లైన్ నంబర్ 1098కు ఫోన్ చేయవచ్చు.

ఉచిత న్యాయసహాయం అందించనున్న ప్రభుత్వం

అధికారులు వెంటనే స్పందించి వారికి విముక్తి కల్పిస్తారు. బాలలపై హింస, దాడులకు పాల్పడితే వారిపై ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మహిళలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జెండర్ రిసోర్స్ కేంద్రాలు (జీఆర్సీ)ను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే ఘటనలతో విశాఖపట్నం జిల్లాలో ఇప్పటికే రావికమతం, నక్కపల్లిలో సేవలు అందిస్తున్నాయి. నర్సీపట్నం, కె.కోటపాడుకు కొత్తగా మంజూరయ్యాయి. మరో మూడు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయని అధికారులు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాలు, సమాజంలో చోటుచేసుకుంటున్న పలు అతివలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలత చెందడం, ఎవరికీ చెప్పుకోలేక వారిలో వారే కుమిలిపోతే మానసికంగా కుంగిపోతున్నారు.

పోలీసు స్టేషన్ వరకు వెళ్లలేక మిన్నకుండిపోతున్నారు. ఇలాంటి వారందరికీ జీఆర్సీతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా ప్రతినిధులే వీటిని నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కమిటీలు బాధిత మహిళలకు దన్నుగా నిలిచి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తోడ్పాటునందిస్తాయి. కేంద్రాల్లోనే ఒకటి రెండు రోజులు వసతి సదుపాయం కలిస్పారు. మహిళలు, యువతులు, విద్యార్థినులను ఎవరైనా వేధిస్తే 100 నంబరుకు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి ఆదుకుంటారు. దూరప్రాంతమైతే ప్రాంత పోలీసులకు సమాచారం చేరవేసి రక్షణ.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AP Government Child Protection child rescue Cybercrime Help Helpline Numbers Latest News in Telugu Telugu News Women Empowerment women safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.