📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest News: Scrub typhus: స్క్రబ్ టైఫస్ అనే కీటకం కుట్టడంతో.. మహిళ మృతి

Author Icon By Anusha
Updated: December 1, 2025 • 1:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ (Scrub typhus) అలజడి రేపుతోంది.. రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు వెలుగులోకి రావడంతో ఆందోళన నెలకొంది.. ముఖ్యంగా విజయనగరంలో ఈ వ్యాధి లక్షణాలతో ఓ మహిళ చనిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం విజయనగరం చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందింది.

Read Also: Viral Video: బస్సులో సీటుకోసం ప్రయాణికున్ని కొట్టిన మహిళ

స్క్రైబ్ టైఫిస్ లక్షణాలతో మృతి

జ్వరంతో పాటు శరీరంలో నల్లటి చుక్కలాంటి గాయం, తీవ్రమైన అలసట, వణుకులు, శ్వాసకోస ఇబ్బందులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట టైఫాయిడ్ గా గుర్తించి చికిత్స అందించారు వైద్యులు. అయితే వైద్యుల చికిత్సకు జ్వరం తగ్గినా శ్వాస సంబంధ సమస్య మాత్రం తగ్గలేదు.

చివరికి ఆయాసం పెరిగి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది.వైద్యులు లోతైన పరీక్షలు చేయగా ఫైనల్ గా స్క్రైబ్ టైఫిస్ లక్షణాలతో మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు తెలిపారు.

సూక్ష్మ కీటకాలు

చాలా మందికి ఈ వ్యాధి పేరు కూడా తెలియకపోవడంతో ప్రజలు దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైద్యుల వివరాల ప్రకారం, నేలపై ఉండే కొన్ని రకాల నల్లని నల్లి వంటి పురుగులు కాటేయడం ద్వారా ఈ వ్యాధి మనిషికి సోకుతుంది. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, జంతువులకు దగ్గరగా ఉండేవారు, అడవి ప్రాంతాల్లో తిరిగేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

స్క్రబ్ టైఫస్ (Scrub typhus) అనేది చిగ్గర్స్ అనే సూక్ష్మ కీటకాలు కుడితే వ్యాపిస్తుంది. కాటు వేసిన ప్రదేశంలో చిన్న నల్లటి మచ్చ కనిపించడం ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం. గడ్డి, పొలాలు, తడి నేలలు, చెత్తతో ఉన్న ప్రదేశాల్లో ఈ సూక్ష్మ కీటకాలు ఎక్కువగా ఉంటాయి. వీటి కాటు ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎలుకలు, అడవి జంతువులు ఈ బ్యాక్టీరియాకు నిల్వ కేంద్రాలు. వీటి మీద ఉండే కీటకాలు మనుషులపైకి వస్తూ ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి.

Woman dies after being bitten by scrub typhus insect

లక్షణాలు

ఈ వ్యాధి లక్షణాలు చూస్తే.. ఉన్నట్లుండి జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్లు నొప్పులు.కాటు ప్రదేశంలో నల్లటి మచ్చ, దద్దుర్లు, శ్వాస సమస్యలు, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు. ఇక తీవ్రమైన దశలో అవయవాల వైఫల్యం, లివర్, కిడ్నీలు, నర్వస్ సిస్టమ్ సమస్యలు రావచ్చు.

ప్రస్తుతం శీతకాలం సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ఒకటికి రెండు రోజులు జ్వరం గనక ఎక్కువగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి రావాలసి సూచిస్తున్నారు వైద్యులు.స్క్రబ్ టైఫస్ బాధితులకు వెంటనే చికిత్స అందిస్తే మరణాల రేటు 2% లోపు ఉంటుంది. కానీ ఊపిరితిత్తులకు ఈ వ్యాధి సోకితే అలాంటివారు రికవర్ కావడం కాస్త కష్టం అంటున్నారు డాక్టర్లు.. జ్వరం ఎక్కువ రోజులు తగ్గకపోవడం,

జాగ్రత్తలు

గాయం దగ్గర దుర్వాసన, శరీర నొప్పులు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జనాల్లో భయం ఉన్నా, ముందస్తు జాగ్రత్తలు, సమయానికి చికిత్స ఉంటే స్క్రబ్ టైఫీస్‌ను నియంత్రించవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఏ ఏ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి

చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, వైఎస్సార్ కడపలో 94, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది.

స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి?

స్క్రబ్ టైఫస్ అనేది ఒరియెంటియా ట్సుట్సుగాముషి (Orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా చిగర్ మైట్స్ (చిన్న పురుగులు) కాటు వల్ల వస్తుంది.

Scrub Typhus ఎలా వస్తుంది?

చెట్ల దగ్గర, పొలాల్లో, అడవుల్లో ఉండే చిగర్ మైట్స్ కాటు వేస్తే ఈ వ్యాధి సోకుతుంది.

Scrub Typhus లక్షణాలు ఏమిటి?

ఎక్కువ జ్వరం

శరీరం నొప్పులు

తలనొప్పి

గొంతు నొప్పి

కాటు వేసిన చోట నల్లటి గాయంలాంటి స్పాట్ (Eschar)

వాంతులు

అలసట

Scrub Typhus ప్రమాదమా?

చికిత్స చేయకపోతే ప్రమాదకరం. కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు పై ప్రభావం చూపుతుంది. టైం లో చికిత్స చేస్తే పూర్తిగా క్షేమం అవుతుంది.

Scrub Typhus తో జ్వరం ఎన్ని రోజులు ఉంటుంది?

సాధారణంగా 5–7 రోజులు. కానీ మందులు వాడకపోతే వారం రోజులకంటే ఎక్కువగా ఉంటుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Health Alert latest news Scrub Typhus Telugu News vijayanagaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.