हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : eligible people – అర్హులకు అందలాలు అందేనా?

Sudha

ప్రజాస్వామ్య పాలనలో మానవీయకోణం ఎంతో అవసరం. ఆ నేపథ్యంలోనే పేద బడుగు బలహీన వర్గాలకు ఉచిత పథకాలు అమలవుతుంటాయి. అవన్నీ నిజమైన అర్హులకు (eligible people)అందితే ఎవరికీ ఏ అభ్యంతరం కలుగదు. ప్రధానంగా బిపిఎల్ వర్గాలకు అందితే స్వాగతించదగినదే. కానీ ప్రస్తుత పాలనల్లో భిన్న విధానాలు అనుసరించడం ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే కొన్ని ఉచిత పథకాలను ప్రకటించడం అసలు సిసలు పథకాలను సక్రమ అమలు ను పట్టించుకోకపోవడం వల్లనే ప్రభుత్వాలు విమర్శకు గురువుతున్నాయి. నాలుగు దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికల ముందు తతంగాలలో మందిని తమకు అనుకూలంగా మార్చుకోవడం ప్రస్తుత రాజకీయ మంత్రాంగం మారింది. ఆనక అమలులోనూ చిత్తశుద్ధి కొరవడుతుందన్నది. ప్రజలను పరాన్నజీవులుగా తయారు చేయొద్దని ఉచితల పంపిణీపై ఈ దేశ అత్యున్నత ధర్మాసనం ఏనాడో అభిప్రాయపడింది. మరికొన్ని సందర్భాలలో ఉచితాలు అనుభవించడానికి అలవాటుపడి జనం తమ సొంత జీవనోపాధులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారనే అనుభవాలను కూడా చూసాము. అయినా ఉచితాల విషయంలో ఏ రాజకీయ పార్టీ నిష్ఠగా ఉండలేకపోతోంది. ఇప్పుడు 2 నెలల్లో బీహారు ఎన్నికలు రాబోతున్నాయి. బీహార్ ఎన్నికల ప్రభ ఏ మాత్రం తగ్గిపోకుండా వివిధ రాజకీయ పార్టీలు టక్కు టమారగోకర్ణ విద్యలు ప్రవే శించడానికి ఏనాడో అంకురార్పణ చేశాయి. దేశంలో పేదలు అణగారిన వర్గాల కోసం ప్రభుత్వ పథకాలకు కొరత లేదు, కానీ వాటి కింద ఆశించిన ప్రయోజనాలు ఉద్దేశించిన లబ్దిదారులకు (eligible people)అరుదుగా చేరుతాయనే అపప్రథ ఉండనే ఉంది. వాటి అమలును పటిష్ట పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అది మాని ఎన్నికల సమయంలో కొత్తగా రాజకీయ సంకల్పం చెప్పుకోవడం జరుగుతోంది. ఎన్నికలకు ముందు, పోలింగ్ రోజున ఓటర్లకు డబ్బు పంపిణీ ఎలాజరుగుతుందో తెలియనిది కాదు. వచ్చే ఏడాది తమిళనాడుకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలు అనగానే బీహారు మాత్రమే గుర్తొచ్చేవిన్యాసాలను ఇప్పటికే ఎన్నో చూసాం. ఎన్నికల కమిషన్ నిర్ణయాలు వివిధ రాజకీయ పార్టీలతో వ్యవహరిస్తున్న తీరును విపక్షాలు తప్పు పట్టే స్థాయికి చేరింది. అక్కడ ఓటర్ల సవరణ కార్యక్రమంలో అనుమానాస్పద అంశాలన్నీ విమర్శలకు గురువుతున్నాయి. వీటికి తోడు ఎన్నికల కమిషన్ అక్కడి విధానాలను ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించ డంతో బీహారుప్రయోగాన్ని రాజకీయ పార్టీలెవరూ మరచి పోలేకపోతున్నారు. బీహారులో మళ్లీ అధికారం హస్తగతం చేసుకోవాలనిఆశిస్తున్న ప్రధాన పార్టీకి ఎన్నికల కమిషన్ ద్వారా ఏదో అనుచిత లబ్ది కలుగబోతోందన్న సందేహం ప్రజా బహుళ్యంలోకి బాగా వెళ్లిపోయింది. ఇలాంటి పరి స్థితుల్లో ప్రజలు ప్రస్తుత పాలనను బేరీజు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
అంతేగాక తాజాగా ప్రస్తుతప్రభుత్వాధి నేత నితీష్కుమార్ తన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తరపున ప్రజా సంక్షేమ పథకాలు ప్రకటించారు. ప్రస్తుతం బీహార్లో ప్రభుత్వ ఉచితాల వర్షం కురుస్తోంది. గత పదేళ్లుగా అక్కడ అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి అకస్మాత్తుగా ప్రజలపై ప్రేమపుట్టుకొచ్చింది. బీహార్లో అనతికాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నితీష్ కుమార్. గత 20సంవత్సరాలుగా 278 రోజుల స్వల్పకాలిక పాలనతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. అకస్మాత్తుగా దూరదృష్టిగల నాయకుడిగా మారారు. దాదాపు అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికసహాయ పథకాలను ప్రకటించారు. ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. చూస్తుంటే మొన్నటి మహా రాష్ట్ర ఎన్నికలలో లక్కీ బెహన్ యోజన పథకం ఇచ్చిన ఫలితాలనే ఇస్తాయనే నమ్మకం కలిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు. వాటిలో గత నెల ఆగస్టు 1 నుంచి నెలకు 125 యూనిట్ల వరకు ఉచితవిద్యుత్, ఎస్సీ, ఎస్టీ వర్గాలలో పని చేసే 10,000మందికి పైగా ‘వికాస్ మిత్రలకు ఒక్కొక్క రికి రూ 25 వేలు, టాబ్లెట్ల కొనుగోలు కోసం ప్రజలకు రూ10వేలు, 30వేల మందికి పైగా విద్యావేత్తలకు రూ.10 వేలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలలో పనిచేస్తు న్నారు. సీనియర్ సిటిజన్లకు పెన్షన్పెంచారు. రెండేళ్లపాటు నెలకు వెయ్యి రూపాయల మేరకు నిరుద్యోగభృతిని అందించబోతున్నారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద 75 లక్షల మంది మహిళా వ్యవస్థాపకులకు ఒక్కొక్క రికిరూ.10వేలు అందిస్తుంది. దీని మొదటి విడత తరు వాత 2లక్షలకు పెంచుతారు. వృద్ధులకు, వికలాంగులకు భరోసా ప్యాకేజీలు పెంచారు. కొన్ని వర్గాలకు భత్యాలు పెంచారు. టీచర్ల నియామకం జరుగుతోందని ముఖ్య మంత్రి ప్రకటించారు. అంగన్వాడి సేవికల జీతం 7 వేల నుంచి 9వేలకు పెంపు, కూడా ఇందులో భాగమే. దానికి ప్రతిగా ప్రతిపక్ష ఆర్జెడి పార్టీ నెలకు 200విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు, మహిళలకు ఆర్థిక సహయం నేరుగా 2500 ఇస్తామన్నారు. ఇలా ఎన్నికల
సమయంలో ఒకరికి పోటీగా మరొకరు ఉచితాలు ప్రకటిం చడం పరోక్షం గా ప్రలోభ పెట్టడమే. దేశంలో స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలను నిర్ధారించడానికి స్వర్గం భూమిని కదిలించే ఎన్నికల సంఘం వేరేవిధంగా చూడటానికి ప్రతి కారణం ఉంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే ముందు ఇలా పరీక్ష ఓట్ల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న ఈఉచిత ప్రచారాన్ని అంతం చేయకపోతే, నిష్పాక్షి కమైన ఎన్నికల ప్రచారంపై ఉన్నఅంచనాలు అగాధం లోకి పడిపోతాయి. ఇలాంటి వాటిని నిరోధించేందుకు అనుచితంగా ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కూడా యోచించాలి.

బీహార్‌లో ఎంత జనాభా ఉంది?

2025 నాటికి బీహార్ అంచనా జనాభా దాదాపు 134.3 మిలియన్లు (13.43 కోట్లు) ఉంటుందని అంచనా వేయబడింది, ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం నమోదైన 104.1 మిలియన్లు (10.41 కోట్లు) నుండి గణనీయమైన పెరుగుదల. దీని వలన బీహార్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది.

బీహార్ జిడిపి?

బీహార్ ఎక్కువగా సేవల ఆధారితమైనది, అయితే వ్యవసాయం మరియు పరిశ్రమలు కూడా గణనీయంగా దోహదపడతాయి. ప్రస్తుత ధరల ప్రకారం, రాష్ట్ర GDP 2025–26లో ₹1,097,264 కోట్లు (US$130 బిలియన్) గా అంచనా వేయబడింది. $130 బిలియన్ (నామమాత్రం; 2025 అంచనా) $572 బిలియన్ (PPP; 2025 అంచనా)

Read hindi news: hindi.vaartha.com

Epaper :https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870