📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : Terrorism : ఉగ్రవాదానికి ఊపిరి పోస్తున్నదెవరు?

Author Icon By Sudha
Updated: November 12, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో అరాచకం ప్రబలిపోయింది. అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అనుకోని సంఘటనలు మరీను. పెరిగిన శాస్త్రవిజ్ఞానం, సాంకేతికత దుష్టుల చేతుల్లో పడింది. వారే వీటిని ఎక్కువగా వినియోగించు కుంటున్నారు. దుర్వి నియోగం చేస్తున్నారు. డిటోనేటరు ఉపయోగించి ఢిల్లీలో ముష్కరులు కొందరు కారులో ఆత్మాహుతి పేలుడుకు రూపకల్పన చేశారు. ఢిల్లీలో ఎర్రకోట వద్ద ఒక్కసారిగా పేలిన కారు వలన పెద్ద విధ్వంసానికే ఒడికట్టారు. టెర్రరిస్టుల (Terrorism) ఘాతు కమేనని తేలిపోయింది. వారు మాత్రమే ఇలాంటి దురాగతాలకు పూనుకుంటారు. తాము శత్రువుగా భావించిన దేశ ప్రజల చెడును కోరుకుంటారు. ఒకపక్క దేశ నిఘా వర్గాలు టెర్రరిస్టుల కుట్రలను భగ్నంచేసి వారి వల్ల కలిగే ఆగడాలను అరికడ్తున్న వేళ ఢిల్లీ ప్రేలుడు దుర్ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం కారులో విస్ఫోటం సంభవించగా 6 కార్లు, రెండు ఆటోలు పూర్తిగా ధ్వంసంకాగా 12 మంది మృతిచెందారు. మరికొందరు ఢిల్లీ ఆసుపత్రు లలో క్షతగాత్రులై చికిత్స పొందుతున్నారు. కొందరి పరి స్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటనతో దేశమంతటా ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఈ కుట్రకు పాత్రధారులెవరో, సూత్ర ధారులెవరో కనుక్కునేందుకు వారి తదుపరి దుశ్చర్యల ఆటకట్టించేందుకు ఢిల్లీ యుపి, హర్యానా, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హైదరాబాద్, విజయవాడలలో హై అలర్ట్ ప్రక టించారు. లాలిలా మెట్రో స్టేషన్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కు చేరుకున్న ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. డాక్టర్ ఉమర్ మహ్మద్ అనే వ్యక్తి కారులో పేలుడు పదార్థాలుంచి ఆత్మాహుతి దాడికి సిద్ధమైనట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ పేలుడు ఘటనను దేశద్రోహం ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ ఘటనకు డాక్టర్ ఉమర్ను కీలక సూత్రధారిగా ఎంచి ఎస్ఐఎ అరెస్టు చేసింది. పేలుడు కోసం అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ను ఉపయోగించినట్లు తేలింది. ఈ రసాయనిక ద్రావణం అత్యంత ప్రమాద కరమైనది. గతంలో లెబనాన్ లో జరిగిన అతిపెద్ద పేలుడుకు ఓడలో ఉన్న అమ్మోని యం నైట్రేటే కారణం. పేలుడు తర్వాత హానికర విష పదార్థాలను విడుదల చేస్తుంది. ప్రాణాపాయకరమే. బీరుట్ నగరానికి ఆర్థికనష్టం కలిగించిన అతిపెద్ద దుస్సం ఘటన అది. దాదాపు 2౦౦ మంది చనిపోయారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఆనాటి దుర్ఘటన తాలూకు పథకాన్ని అర్థం చేసుకుని అదే తరహాలో ఢిల్లీ కారుబాంబ్ బ్లాస్ట్క పాల్పడినట్లు అనుమాని స్తున్నారు. విధ్వంసకారుల ఆలోచనలు అంతకన్నా మంచి దారిలో ఉండే అవకాశం లేదు. కాగా ప్రజల్లో అప్రమత్తత తీసుకు రావడం ద్వారా అధిక ప్రాణ, మాన, ఆస్తినష్టాలు లేకుండా చూసుకోగలం. కశ్మీర్ లోని పహల్గెం సంఘటన లో నేరుగా యాత్రికులపై కాల్పులు జరిపిన దురాగతం తర్వాత ఉగ్రవాదులు ఉన్మాదం ఎలా ఉంటుందో తెలియ చేసే ఘటనగా ఈ ప్రేలుడు భావించవచ్చు. ఆత్మాహుతి దాడిగా దర్యాప్తు బృందాలు చెబుతున్నా ఉగ్రవాదానికి పరాకాష్టగా కారు పార్కింగ్లో రిమోట్తో పేల్చిఉంటారని కూడా అనుమానిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలన్నీ ప్రస్తుత దర్యాప్తు బృందాల నిఘా పరిశీలనలో ఉన్నారు. హైదరాబాద్లో కూడా ఉగ్రవాదుల (Terrorism) మూలాలు లేదా వారి కన్నుసన్నల్లో పనిచేసే స్లీపర్ సెల్స్ ఉంటాయని గత అనుభవాలు చెబుతున్నందున హైదరాబాద్లో అను మానితుల ఇండ్లల్లో పరిసర ప్రాంతాల్లో తనిఖీలు జరు గుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో జల్లెడపడ్తున్నారు. భూటాన్ వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ ఉగ్రకుట్ర మూలాలు కనిపెట్టామని బాధాతప్త హృద యంతో చెప్పారు. ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్లో 9 మంది ఉగ్రవాదుల్ని 2900 కిలోల బాంబు తయారీ పదార్థాలను పట్టుకున్నరోజునే ఇలాంటి దుస్సంఘటన జరగడంతో ‘ఉగ్రకుట్ర తాలూకు సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఈ భారీ కుట్రకు కారకులై ఉంటారన్న అనుమానితులైన వారిని 3 రాష్ట్రాల్లో 8 మంది ఉగ్రవాదుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మరో విధమైన కుట్రలు కూడా బయటపడ్డాయి. ఉగ్ర లింకులున్నవారంతా డాక్టర్లే కావడం విచార కరం. హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ సయ్యద్ మొహియుద్దీన్ ఇంట్లోనే ‘రెసిన్’ అనే విష పదార్థాన్ని తయారు చేస్తున్నక్రమంలో పట్టుకున్నారు. మంచినీటి ట్యాంకుల్లో ప్రసాదాల్లో ఈ విషపదార్థాన్ని కలిపి భారీ సంఖ్యలో మను షుల్ని చంపే పన్నాగంగా పోలీసులకు ప్రాథమిక సమాచారం లభించింది. తాజా పరిస్థితులను బట్టి ఉన్న విద్యా వంతుల్లో కొందరు ఉగ్రవాదానికి ప్రోత్సాహకాలుగా బయటికొస్తున్నారు. ఈవిషయం తలుచుకోవడానికి విస్మ యం కలిగిస్తోంది. ఒక చోట అత్యంత భారీ మొత్తంలో పేలుడు పదార్థా లను స్వాధీనం చేసుకున్నప్పటికీ మరో చోట జరుగ కూడదని ఘోరం జరిగిపోయింది. ఇలా ఉగ్ర వాదంవైపు ఉన్నత విద్యావంతుల్ని మరలించడమే కాదు. వారే క్రియాశీల కంగా ఉండేట్లు భారత్పట్ల శత్రుత్వాన్ని నూరిపోయడంలో ఉగ్రవాద సంస్థలు ఎంతకైనా తెగిస్తా యనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా భారత్లో దొరి కిన ఉగ్రవాదులు విద్యాసంస్థలకు ధాతృత్వ సంస్థలనుంచి నిధుల కోసం కృషి చేయడం కొత్త కోణంగా ఆవిష్కృత మైంది. వీరికి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో దర్యాప్తు సంస్థలు తేల్చిచెప్పాలి. ఇరు దాయాది దేశాల మధ్య పోరు తప్పించుకోలేక పాలకులే పరోక్షంగా చిచ్చుపెట్టడం క్షమించరానిది.

Read hindi news :hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Counter Terrorism Global Security latest news National Security Telugu News Terror Networks Terrorism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.