ఎక్కడి దొంగలు (Thieves)ఆక్కడే గప్ చుప్ సాంబారు బుడ్డి’ చిన్నప్పుడు ఆడే ట మాదిరిగా కనిపించకుండాపోయినా 400 కోట్ల రూపాయలతో కూడిన రెండు కంటైనర్ల విషయంలో ఎవరికి వారే సర్దుకున్నట్టుగా వుంది. అధికారం లో వున్న కొంతమంది నాయకులు, ఉన్నతాధికారులు వేల కోట్ల రూపా యల అవినీతి కార్యకలాపాలకు సం బంధించిన వార్తలు వినడానికి అల వాటు ప్రజలకు ఈ డబ్బుతో కూడిన కంటైనర్లు కనిపించకుండా పోవడం చిత్రవిచిత్రంగా అనిపి స్తోంది. అలచోకగా వింత వింత అంశాలతో సినిమాలు తీసే దర్శకుల స్క్రీన్ప్లేకు మించి ఈ కంటైనర్ల కథనం నడిచి నట్టుగా వుంది. సహజంగా జవాబు దొరకని ప్రశ్ననుబిలి యన్ డాలర్ల ప్రశ్న అని అంటారు. ఈ సంఘటనకు సం బంధించి సామాన్య ప్రజలలో అనేక ప్రశ్నలు వెంటాడుతున్నాయి. అసలు ఆ కంటైనర్లలో వున్నది రూ. 400కోట్లేనా లేక లెక్కకు మించిన కోట్లు వున్నాయా? వందల కోట్ల రూపాయలతో కూడిన కంటైనర్లు కనిపించకుండా పోవడం ఏమిటి? అసలుఎక్కడ బయలు దేరాయి? ఎక్కడకు వెళుతున్నాయి? ఈ డబ్బు ఎవరికి సంబంధించినది? వారికి ఈ డబ్బు ఎలా వచ్చింది? ఇంత పెద్దమొత్తంలో డబ్బు నిల్వ చేస్తే ఆయా రాష్ట్రాలలో వున్న పోలీసులు ఏం చేస్తున్నారు? డబ్బుతో కూడిన కంటైనర్లు కనిపించకుండా పోయాయంటూ రెండు వారాల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇన్కంటాక్స్ చెల్లిస్తున్నాడా? ఆ వ్యక్తి గురించి ఇడి ఇప్పటి వరకు నోరు విప్పడం లేదు ఎందుకని? ఇంకా అనేక ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ప్రజలలో తలెత్తిన ఈ ప్రశ్నల విలువ ఎంతో నిఘా అధికారులు చెప్పాల్సి వుంటుంది.
Read Also : http://Railway News: హోలీ పండుగకు రైల్వే శుభవార్త
గోప్యత పాటిస్తున్నారా?
సహజంగా ఇంట్లో బంగారం /డబ్బు పోయిందని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదులో పేర్కొన్న మొత్తంలో సగానికి మాత్రమే కేసు నమోదు చేస్తారు. అందువల్ల కనిపించకుండా పోయినా ఆ రెండు కంటైనర్లలో వున్నవి 400 కోట్లరూపాయలేనా అని ప్రజలు అనుమానిస్తున్నారు. కనిపించకుండా పోయినా కంటైనర్లు సరుకులు చేరవేసే కంటైనర్లా లేక స్కూటర్లు కార్లు రవాణా చేసే పొడవాటి కంటైనర్లా? అనే ప్రజల అనుమానాలకు ఎవరు సమాధానం చెబుతారు. అంతేకాకుండా నిజంగా ఫిర్యాదు దారుడు చెబు తున్నట్టుగా కనిపించకుండా పోయినవి రెండు కంటైనర్లేనా లేక ఇంకా వున్నాయి అనే అనుమానం కూడా తేలాల్సి వుంది. డబ్బుతో కూడిన కంటైనర్లు కనిపించకుండా పోయిన వార్త చదివితే స్వతంత్ర భారతదేశంలో ఏదైనా సాధ్యమేనని పిస్తోంది. పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే, పోలీసులు ఫిర్యాదు చేసిన వ్యక్తి తల్లిదండ్రులు, కులం మొదలుకొని అనేక వివరాలు సేకరిస్తారు. కానీ 400 కోట్ల రూపాయల వాహనాలు తప్పిపోయాయని ఫిర్యాదు చేసిన వ్యక్తికి సం బంధించిన పూర్తి వివరాలను పోలీసు చెప్పడం లేదు. కిషోర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన డబ్బు అని, విరాట్ గాంధీ అనే హవాల వ్యాపారికి సంబంధించిన డబ్బు అనే వదంతులు వచ్చాయి. ఈ డబ్బుకు సంబంధించిన వ్యక్తి ఒకరు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంతో కూడా సంబం ధం కలిగివున్నట్టు వార్తలు వచ్చాయి. ఇన్ని రకాల వార్తలు బయటకు వచ్చినప్పటికీ పోలీసులు పూర్తిస్థాయి వివ రాలు తెలియక చెప్పడం లేదా తెలిసినా గోప్యత పాటి స్తున్నారా?అనేది అర్థం కావడంలేదు. అయితే ఈ కేసుకు సంబం ధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసి సాయంత్రానికి వదిలి వేసినట్టు వార్తలు వచ్చాయి. నిజానికి నిందితులను అరెస్టు చేయాలి కానీ, అదుపులోకి తీసుకోవడం ఏమిటో అర్థం కావడం లేదు.
నిఘా వ్యవస్థలు వున్నాయా?
ఫిర్యాదు దారుడు మహారాష్ర లో పోలీసులకు ఫిర్యా దు చేసినప్పటికీ, ఫిర్యాదు దారుని సొంత రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్నాడు? చేస్తున్న వ్యపారంఏమిటి? అనే విషయాలు తెలియడం లేదు. అంతేకాకుండా అవినీతికి సంబంధించి ఏ చిన్న వార్త వెలుగు చూసినా రాష్ట్రాలలో అవినీతి నిరోధక సంస్థలు (ఎసిబిలు), కేంద్రప్రభుత్వానికి చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సిబిఐ), ఎకనమిక్ ఎఫెన్సెస్ డిపార్ట్మెంటు (ఈడి)లకు చెందిన అధికా రులు చుట్టుముడతారు. కానీ మహారాష్ట్రలోని ఎసిబి అధికా రులు కానీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన అధికారులు కానీ పట్టించుకున్న దాఖలా కనిపించడం లేదు. అదేవిధంగా సిబిఐ, ఈడి అధికారులు కూడా వీరు ఇంకా రంగంలోకి దిగలేదు. డబ్బుకు సంబంధించిన ఎవరైనా బహిరంగంగా 400 కోట్ల రూపాయలను కంటైనర్ల ద్వారా తరలించారంటే పైన తెలిపిన అధికారుల ఇజ్జత్కా సవాల్ అని చెప్పాలి. సహజంగా ఇటువంటి వ్యవహారాలన్ని గుట్టు చప్పుడు కాకుండా జరుగుతాయి. ఒకవేళ బయట పడినా ఎవరికి వారే తేలుకుట్టిన దొంగలా(Thieves) వుండిపోతారు. కానీ ఇందుకు విరుద్ధంగా 400కోట్ల రూపాయలు కనిపించకుండా పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగి స్తోంది. ఒకవేళ పోలీసులు, నిఘా అధికారులు డబ్బుతో కూడిన కంటైన్నర్లను పట్టుకొన్నప్పటికీ ఇన్ని వందల కోట్ల రూపాయాలకు లెక్క చెప్పడం అంత తేలికైన వ్యవహారం కాదు. అయినప్పటికీ డబ్బు కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక కూడా ఏదోబలమైన కారణం వున్నట్టు అనిపిస్తోంది. మొత్తంగా ఈ కేసు వ్యవ హారం అధికారులకు ఈ సంఘటన తర్వాత భారతదేశంలో దేశీయ నిఘా వ్యవస్థలు వున్నాయా? వుంటే ఎవరి ప్రయో జనాల కోసం పనిచేస్తున్నాయి? అనే మీమాంస కలుగుతోం ది. ఈకేసు విషయం వెలుగు చూసిన ప్రారంభంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ పార్టీకి చెందిన డబ్బు అంటే మీ పార్టీకి చెందిన డబ్బు’ అంటూ పరస్పరం ఆరోపణలు చేసుకొన్నారు. త్వరలోతమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈ ఆరోపణలు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఎవరికి వారు మౌనం పాటిస్తున్నారు. నిజానికి ఈ కేసుకు సంబంధించిన మూలాలు రాజకీయ పార్టీ నేతల వద్దనే వున్నాయని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయ పార్టీల నేత లు ఈ అపవాదు నుంచి బయట పడాలంటే ఈ కేసుకు సంబంధించిన వివరాలను వీలున్నంత త్వరగా బహిర్గతం కావడం అవసరం. అంతేకాకుండా నిఘావ్యవస్థలకు చెందిన అధికారులు ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలను వెల్ల డించి, సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయడం ద్వారా తమ సమర్థతను చాటుకోవాల్సిన అవసరం వుంది.
-అన్నవరపు బ్రహ్మయ్య
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: