📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : White gold : తెల్ల బంగారం.. రైతు శ్రమకు గ్లోబల్ గౌరవం

Author Icon By Sudha
Updated: October 7, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ పత్తి దినోత్స వాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. వ్యవసాయ రంగంలో అత్యంత (పాధాన్యం కలిగిన పత్తి పంట కేవలం వస్త్ర పరిశ్రమకే కాదు, కోట్లాది మంది రైతు ల జీవనాధారంగా నిలుస్తుంది. తెల్ల బంగారం అని పిలువబడే ఈ పంటకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం కల్పించ డం లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి వాణిజ్యాభివృద్ధి సదస్సు వంటి అంతర్జాతీయ సంస్థలు కలిసి 2019లో మొదటిసారిగా ప్రపంచ పత్తిదినోత్స వాన్నిప్రారంభించాయి. 2019 అక్టోబర్ 7న స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో జరిపారు. పత్తి ఉత్పత్తి దారులు, వ్యాపారులు, దుస్తుల తయారీ పరిశ్రమ, రైతులు, ప్రపంచ ఆర్థికవ్యవస్థలో ఈ పంట ప్రాధాన్యాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది. పత్తి (White gold) కేవ లం ఒక పంట మాత్రమే కాదు, అది లక్షలాది మంది రైతుల జీవనాధారం, దుస్తుల పరిశ్రమకు మూలాధారం, ప్రపంచ వ్యాపార చరిత్రలో ఒక ప్రధాన విభాగం. ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం పత్తి (White gold) పంట ప్రాధాన్యతను ప్రపం చ వ్యాప్తంగా గుర్తించటం, దాని ఉత్పత్తి, వ్యాపారం, పర్యా వరణ అనుకూలత, ఆర్థిక ప్రాధాన్యతలపై అవగాహన కల్పిం చడం. పత్తి రైతులు ఎదుర్కొనే సమస్యలు, ధరల మార్పు లు, వాతావరణ మార్పుల ప్రభావం వంటి అంశాలపై చర్చించటానికి, స్థిరమైన సాగు పద్ధతులను ప్రోత్సహించ టానికి ఈ దినోత్సవం ఒక అంతర్జాతీయ వేదికగా నిలుస్తుంది.

White gold : తెల్ల బంగారం.. రైతు శ్రమకు గ్లోబల్ గౌరవం

ప్రధాన పత్తి ఉత్పత్తి ప్రాంతాలు

ప్రపంచవ్యాప్తంగా ఎనభైకి పైగా దేశాలు పత్తిని సాగు చేస్తున్నాయి. చైనా, భారతదేశం, అమెరికా, బ్రెజిల్, పాకిస్థాన్, టర్కీ వంటి దేశాలు ప్రధాన ఉత్పత్తిదారులు. వీటిలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి (White gold) సాగు దేశంగా నిలుస్తుంది. దేశంలోని మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పత్తి ఉత్పత్తి లో అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఎండ ప్రాంతాలు, వర్షాధారిత భూభాగాలుపత్తి సాగుకు అత్యంత అనుకూలమైనవిగా గుర్తించబడ్డాయి. భారతదేశం ప్రపంచ పత్తి ఉత్పత్తిలో కీలక స్థానం కలిగి ఉంది. చైనా తరువాత భారత్ ప్రపంచంలో రెండవ అతి పెద్ద పత్తి ఉత్పత్తిదారు. దేశవ్యాప్తంగా సుమారు 130 లక్షల హెక్టార్ల భూమిలో పత్తిసాగు జరుగుతోంది. సంవత్స రానికి సగటున 360-400 లక్షల గింజల బేళ్ల పత్తిఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ప్రధాన పత్తి ఉత్పత్తి ప్రాంతాలు. భారతదేశం ప్రపంచ పత్తి ఎగుమతుల్లో కూడా మొదటి మూడు స్థానా ల్లో ఉంటుంది. ‘మేడ్ ఇన్ ఇండియా కాటన్’ అనే పేరుతో భారత పత్తి ప్రపంచ మార్కెట్లో నాణ్యతకు ప్రతీకగా నిలు స్తోంది. పత్తిపంట కేవలం వస్త్ర తయారీకి మాత్రమే కాకుం డా అనేక అనుబంధ రంగాలకు ప్రాణాధారంగా నిలుస్తుంది. పత్తి విత్తనాల ద్వారా నూనె, పిండి, పశువుల మేత తయా రీ జరుగుతుంది. అలాగే టెక్స్టైల్ మిల్లులు, హ్యాండ్లూమ్ పరిశ్రమలు, తాడు తయారీ, మెడికల్ కాటన్ ఉత్పత్తులు వంటి అనేక రంగాలకు పత్తి ప్రధాన ముడి సరుకుగా ఉంది. ఈవిధంగా పత్తి పంట దేశ ఆర్థికవ్యవస్థలో కీలక స్తంభం గా నిలుస్తుంది. ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా పత్తి రైతుల సంక్షేమం, వారికి సరైన ధర భరోసా, కొత్త రకాల విత్తనాల అభివృద్ధి, నీటివనరుల సమర్థ వినియోగం, పర్యా వరణ అనుకూల సాగు విధానాల ప్రోత్సాహం వంటిఅంశా లపై ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు చర్చలు నిర్వహిస్తాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధిలో ప్రారంభమైన ‘కాటన్’ ప్రాజెక్టు (బుర్కినా ఫాసో, చాద్, మాలి, నైజర్) పత్తి ఉత్పత్తి దేశాల అభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధి కోసం రూపొందించ బడింది. పత్తి పర్యావ రణ పరిరక్షణకు కూడా తోడ్పడే పంట. ఇది సహజమైన, బయో డిగ్రేడబుల్ ఫైబర్ కావడంతో ప్లాస్టిక్, పాలిస్టర్ వంటి కాలుష్య కారక పదార్థాలకు ప్రత్యామ్నాయం అందిస్తుంది.

White gold : తెల్ల బంగారం.. రైతు శ్రమకు గ్లోబల్ గౌరవం

గ్రామీణ భారత ఆర్థికం

పత్తి ద్వారా తయారయ్యే వస్త్రాల పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన వినియోగ పదార్థాలుగా నిలుస్తాయి. ‘కాటన్ ఈజ్ లైఫ్’ అనే నినాదం పత్తి మనిషి జీవితంలో ఉన్న అంతర్భాగాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో ఈ రోజు సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు పత్తి రైతుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణలు, విత్తనాల ప్రదర్శనలు, ఎగుమతుల ప్రోత్సాహం, టెక్స్టైల్ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞా నాల పరిచయం వంటి అనేక కార్యక్రమాలు ఈ రోజున నిర్వహించ బడతాయి. పత్తి పంట కేవలం వ్యవసాయం కాదు, అది గ్రామీణ భారత ఆర్థిక జీవితానికి నాడిగా ఉంది. రైతుల కృషి, కూలీల శ్రమ, పరిశ్రమల అభివృద్ధి, అంతర్జాతీయవాణిజ్య విస్తరణ “రైతుల కృషి, కూలీల శ్రమ, పరి శ్రమల అభివృద్ధి, అంతర్జాతీయ వాణిజ్య విస్తరణ ఈ అన్ని కలిపి పత్తిని నాగరికతకు ప్రతీకగా నిలుస్తాయి. అందువల్ల అక్టోబర్ 7 ప్రపంచ పత్తి దినోత్సవం కేవలం ఒక పంటకు గౌరవ దినం కాదు, అది రైతుల శ్రమకు, ప్రకృతి ప్రసాదా నికి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు అంకితమైన విశ్వమానవ ఉత్సవం. తెల్ల బంగారం అయిన పత్తి సమృద్ధి మానవ సమాజ
అభివృద్ధికి మూలాధారం.

-రామ కిష్టయ్య సంగన భట్ల

పత్తి ఎన్ని రకాలు?

ప్రపంచవ్యాప్తంగా డిజైనర్లు, రిటైల్ లేబుల్స్ మరియు వస్త్ర పరిశ్రమలు మార్కెట్లో 135 కంటే ఎక్కువ రకాల పత్తి రకాలు అందుబాటులో ఉన్నాయి మరియు వీటిని ఉపయోగిస్తున్నాయి.

నాణ్యమైన పత్తి ఏది?

పిమా భూమిపై అత్యుత్తమ పత్తిగా పరిగణించబడుతుంది. అదనపు-పొడవైన ప్రధాన (ESL) పత్తిగా, దాని పొడవైన ఫైబర్‌లు దానిని మరింత మృదువుగా మరియు అదనపు బలంగా చేస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

agriculture Breaking News Cotton farmer pride global recognition latest news Telugu News white gold

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.