Andhra: పొలం చదును చేస్తుండగా బయటపడిన బకెట్లో ఏముందంటే?

Read Time:  1 min
Andhra: పొలం చదును చేస్తుండగా బయటపడిన బకెట్లో ఏముందంటే?
FONT SIZE
GET APP

అనంతపురం జిల్లా (Anantapur District) వేపచర్ల అటవీ ప్రాంతంలో జరిగిన ఓ అనూహ్య సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టమాట సాగు కోసం భూమిని సిద్దం చేస్తున్న ఓ రైతు, మట్టిని తవ్వుతుండగా ఊహించని విషయం ఎదురైంది.అదేదో సాధారణ వస్తువు అనుకున్న రైతు, ఆసక్తిగా ఆ బకెట్‌ను బయటకు తీసి చూశాడు. కానీ అందులో ఉన్నవి చూస్తూనే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.సమాచారం అందుకున్న కొద్దిసేపట్లోనే పోలీసు బృందం అక్కడికి చేరుకుంది. బాంబ్ స్క్వాడ్‌ (Bomb squad), ఫోరెన్సిక్ టీమ్‌లను కూడా స్పాట్‌కు పంపించారు. వారు బకెట్‌ను తనిఖీ చేసిన తర్వాత ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి.అది కేవలం బకెట్ కాదు, మావోయిస్టులు దాచిన డంప్‌గా గుర్తించారు. అందులో డిటోనేటర్లు, తుపాకీ బుల్లెట్లు, ఐరన్ బాల్స్, మావోయిస్టుల డ్రస్సుతో ఉన్న ఫొటోలు, ఇతర సాధనాలు ఉన్నాయి. ఇది చూసిన పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.

15 ఏళ్ల క్రితం మావోయిస్టుల ప్రాబల్యం

వేపచర్ల అటవీ ప్రాంతం 15 ఏళ్ల కిందట మావోయిస్టులకు కీలక కేంద్రంగా ఉండేది. అప్పట్లో వారు అటవీ ప్రాంతంలో సమావేశాలు నిర్వహించేవారు. ఆయుధాలు, మావో లిటరేచర్, ఇతర వస్తువులు అక్కడే దాచేవారు.ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు మొదలుపెట్టారు. మరే ఇతర డంపులు ఉన్నాయేమోననే అనుమానంతో సేకరణ కొనసాగిస్తున్నారు.పోలీసులు పక్క గ్రామాల ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదే విధంగా స్పందిస్తే గణనీయమైన ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు.

రైతు చాకచక్యం వల్ల పెనుముప్పు తప్పింది

ఈ రైతు అప్రమత్తత, చాకచక్యం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు. ఆయన ఆలస్యం చేశాడంటే పరిస్థితి తీవ్రంగా ఉండేది.ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. మావోయిస్టు చలనం ఇప్పటికీ అక్కడ ఎక్కడైనా మిగిలి ఉందా? లేదా ఇది పూర్తిగా పాత డంప్ మాత్రమేనా అన్న దానిపై దృష్టి పెట్టారు.

Read Also : Land Acquisition : రాష్ట్రంలో బలవంతపు భూ సేకరణ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.