వ్యవసాయ విధానాలను రూపొందించడంలో, రైతుల సాధికారతలో కీలక పాత్ర పోషించిన చౌదరి చరణ్ సింగ్ గౌరవార్థం భారత ప్రభుత్వం 2001లో తొలిసారిగా కిసాన్ దివసన్ను నిర్వహించింది. గ్రామీణ భారతదేశం సవా ళ్లపై అవగాహనకు ప్రసిద్ధి చెందిన సింగ్ రైతుల జీవితా లను మెరుగుపరచడానికి, సుస్థిర వ్యవసాయ అభివృద్ధిని నిర్ధారించడానికి అనేక విధానాలను ప్రవేశపెట్టారు. గ్రామీణ సమాజాల సాధికారత, స్వావలంబన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలని విశ్వసించారు. రైతుల జీవితా లను మెరుగుపరచడానికి అలుపెరగని కృషికి పేరుగాంచిన భారతదేశంలో భూసంస్కర ణలు, గ్రామీణ రుణ ఉపశమనం లో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను ‘ఛాంపియన్ ఆఫ్ ఇండియాస్ ఫార్మర్స్’ అని పిలుస్తారు. రైతుశ్రేయస్సే జాతి శ్రేయస్సు. రైతులు జాతికి ఆత్మ. అందరి కడుపులు నింపేవాడు. వ్యవ సాయం తప్ప ఇంకో పని తెలియని వాడు. తన కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నోడు. నిత్య కృషీవలుడు. పండించడం మాత్రమే తెలిసినోడు. చలైనా, ఎండైనా, వర్షమైనా రైతుకు ఒక్కటే ! కాలంతో పనిలేకుండా తన పొలంలో విత్తడం, దున్నడం, కోయడం చేసుకుంటాడు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయయోగ్యమైన భూమిని కలిగి ఉన్న మన దేశ ఆర్థికవ్యవస్థలో ముఖ్యపాత్ర పోషిస్తూ ప్రజల ఆహారవసరాలు తీర్చే వ్యవసాయంగ్రామీణ ప్రజానీకానికి వెన్నెముక. దేశ మొత్తం భూభాగంలో వ్యవ సాయ అవసరాల కోసం దాదాపు 60శాతం భూభాగం విని యోగించబడుతున్నది. ఉపాధి, ఉత్పత్తిపరంగా ఆర్థికవ్యవస్థ కు ప్రధానమైనది. యాభై ఎనిమిది శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు వ్యవసా యమే ఆధారం. గ్రామాలలో నివసిస్తున్న 72.8 మంది జనాభాలో ప్రత్యక్షంగానూ, పరోక్షం గానూ ఏభై శాతానికి పైగా ప్రజలకు జీవనోపాధిని అంది స్తుంది. మొత్తం శ్రామిక శక్తిలో యాభై ఎనిమిది శాతం ఈ రంగంలోనే ఉన్నారు. దేశ జిడిపిలో వ్యవసాయ వాటా సుమారు పద్దెనిమిది శాతం. వ్యవసాయం ఆహారపరిశ్రమల ముడిపదార్థాలకు మూలం. అధిక జనాభాతో అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రజల ఆహార భద్రతను నిర్ధారించడం లోను, పరిశ్రమలు సేవారంగాల వృద్ధికి వ్యవసాయం ఎంత గానో దోహదపడుతుంది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిం చడానికి, జీవవైవిధ్యాన్ని రక్షించడానికి వ్యవసాయం సహాయ పడుతుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయరంగా నికి రైతన్నేకీలకం.
Read Also: http://Delhi Protests: దీపు దాస్ హత్యపై ఢిల్లీలో భారీ నిరసనలు
రైతుకు ఒత్తిడే
వ్యవసాయం పర్యావరణ, ఆర్థిక, సంస్థా గత, సాంకేతికతపరంగా ఎన్నో ఆటుపోట్లకు గురవుతున్నది. రైతులు (Farmers) వ్యవసాయంలో ఉత్పాదకత, లాభదాయక జీవన నాణ్యతకు ఆటంకం కలిగించే అనేక సవాళ్లను ఎదు ర్కుంటున్నారు. విత్తు నుండి కోత వరకూ రోజూ రైతుకు ఒత్తిడే. సాగుభూమి చిన్నాభిన్నంగా చిన్న కమతాలుగా మారడం, నాణ్యమైన విత్తనాల కొరత, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు పంట ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపి దిగుబడి తగ్గి వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతుంది. సరైన పంట ఉత్పత్తి కాక రైతులు (Farmers) ఉసూరు మంటున్నారు. ఎక్కువ శాతం వ్యవసాయం వర్షాధారమే! 14.1కోట్ల హెక్టార్ల స్థూల విత్తన విస్తీర్ణంలో 52 శాతం అంటే 7.3 కోట్ల హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాన్ని కలిగి ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. అరవై ఐదు శాతం వ్యవసాయం ఋతుపవన వర్షపాతమే ఆధారం. మొత్తం నీటిపారుదల ప్రాంతంలో 40 శాతం కాలువల మీద, మిగిలినది భూగర్భ జలాల మీద ఆధారపడి ఉంది. ఋతుపవనాలలో ఏమాత్రం తేడా వచ్చి సరైన సమయంలో వర్షంపడకపోతే కాలువల మీద ఆధార పడిన ప్రాంతంలో కూడా పంటలు పండవు. ఇక కాలువేతర ప్రాంతాలలో కేవలం భూగర్భజలాలే ఆధారం. అతివృష్టి, అనావృష్టి, పంట ఉత్పత్తిపై ప్రభావం చూపి ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏటా అస్థిరత్వానికి గురవు తోంది. భూ వనరులపై అధిక జనాభా ఒత్తిడి కారణంగా వర్షాధార ప్రాంతాలు, ముఖ్యంగా పొడి భూములు తక్కువ దిగుబడిని ఎదుర్కొంటున్నాయి. వరి, గోధుమలు, పత్తి, నూనె గింజల తో సహా భారతీయ పంటల దిగుబడులు అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. హరితవిప్లవం, అస్తవ్యస్త నీటిపారుదల వ్యవసాయ పద్ధతులు భూమి క్షీణ తకు దారితీశాయి. మానవ కార్యకలాపాల వల్ల వర్షాధారప్రాంతాలు కూడా నేల కోతను క్షీణతను ఎదుర్కొంటుంది. ఒకే పంటను పదేపదే సాగుచేయడం వల్ల నేల పోషకాలను కోల్పోయి నిస్సారంగా మారింది. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరతో పాటుగా లేబర్ ఛార్జీలు కూడా పెరు గుతున్నాయి. పంట పెట్టుబడికి రైతులు అధిక వడ్డీకి రుణా లు వాడుతున్నారు. పంట నష్టపోవడం, పంటలకు గిట్టు బాటుధర లేకపోవడం, అధిక ఖర్చులు వలన సగానికి పైగా వ్యవసాయ కుటుంబాలు అప్పుల పాలవుతున్నారు. చాలా మంది అనధికారిక వనరుల నుండి రుణాలు పొందుతున్నారు.
ధరల అస్థిరత
వాణిజ్యపంటలు సాగుచేసే రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. కరవు, పంట నష్టాలు వలన అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒక్కోసారి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటు న్నారు. అసమర్థమైన వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలు ధరల అస్థిరతకు దారితీస్తాయి. సరైన నిల్వ, రవాణా సౌక ర్యాలు లేకపోవడం వలన రైతులు వెంటనే తక్కువ ధరకే ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇది పంట అనంతర నష్టాల ను మరింత పెంచుతుంది. వీరు పండించే పంటలను విక్ర యించడానికి ఇప్పటికీ దళారులపైనే ఆధారపడుతున్నారు. దళారులు రైతులను మోసం చేస్తున్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ నేరుగా మార్కెటింగ్ విధానం లేకపోవడం వలన వచ్చే ఆదాయంలో కొంత భాగం మధ్యవర్తుల పాలవుతున్నది. ప్రస్తుతం ఉన్న పంటల విధానం కొన్ని ప్రధాన పంటల వైపు మాత్రమే మొగ్గుచూపే విధంగా ఉన్నాయి. పంటలలో వైవిధ్యం లేకపోవడం వల్ల వ్యవసాయ రంగం తెగుళ్లు, వ్యాధులు, మార్కెట్ ఒడిదుడుకుల బారినపడుతుం ది. సాగులో ఆధునిక సాంకేతికలు అమలు పరచడం లేదు. అందరూ స్వంతవ్యవసాయ కమతాలు కలిగిఉండరు. ఇంకొక పెద్ద రైతుదగ్గర వ్యవసాయ క్షేత్రాన్ని కౌలుకు తీసుకుంటారు. పంట సరిగా పండకపోతే వీరు మరింత పేదరికంలోనికి నెట్టబడుతున్నారు. సవాళ్లను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం.
వ్యవసాయంలో సాంకేతికత
వ్యవసాయంలో సాంకేతికతను జోడించి ఖర్చులను కనిష్టం చేసే మార్గాలను ప్రవేశపెట్టాలి. వ్యవ సాయ పనితీరును మెరుగుపరచడం, ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం, గ్రామీణాభివృద్ధికి భరోసా ఇవ్వడానికి ఈసవాళ్లను పరి ష్కరించడం అత్యవసరం. ఇటు రైతు అటు ప్రభుత్వాలు వ్యవసాయానికి రెండు చక్రాల్లాంటి వారు. రైతులు నేల క్షీణతను అరికట్టడానికి తగుచర్యలు తీసుకోవాలి. పర్యావరణ అనుకూల పద్ధతులు పాటించాలి. డ్రిప్, స్ప్రింక్లర్ సిస్టంలతోసహా, సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్ధతులు అవలంబిం చాలి. విభిన్న పంటరకాలు, పద్ధతులను అనుసరించాలి. సేంద్రీయ ఎరువులు వాడాలి. ఇక ప్రభుత్వపరంగా సమర్థ వంతమైన నీటిపారుదల పద్ధతులు, వర్షపునీటి సంరక్షణను అమలు చేయాలి. తీవ్రమైన వాతావరణ సంఘ టనల కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అందుబాటులోకి తేవాలి. ఆహారోత్పత్తిని పెంచేందుకు ఎప్ప టికప్పుడు నిర్ణయించే ఆహార ధాన్యాల ధరలకు తగిన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా వారు సహేతుకమైన ఆదాయాన్ని పొందేలాచూడాలి. పారదర్శక సరసమైన ధరల విధానాలను ఏర్పాటుచేయాలి. మెరుగైన ధరల ఆవిష్కరణ కోసం సమర్థవంతమైన మార్కె ట్ మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయాలి. ప్రతీ రాష్ట్రం లో రైతులు ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా నేరుగా విక్ర యించే ఏర్పాట్లుచేయాలి. రైతులకు ఆర్థికసహాయం మరింత చేయాలి. రైతులు అధునాతన వ్యవసాయ సాంకేతికతలు అందిపుచ్చుకోడానికి డిజిటల్ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందించాలి. భారతీయ వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, సుస్థిరతను ప్రోత్సహించడానికి, ఉత్పాదకతను పెంచడానికి, దేశవ్యాప్తంగా రైతుల జీవనో పాధిని
మెరుగుపరచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి.
-డి జె మోహన రావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: