📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Hyderabad – హైదరాబాద్ కు ఏమైంది? పగలు ఎండలు, సాయంత్రం భారీ వర్షాలు

Author Icon By Anusha
Updated: September 18, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (Hyderabad) కు ఏమైందో ఏమో తెలియడం లేదు. గత నెలరోజుల నుంచి వద్దంటే వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం ఎండలు వస్తాయి, సాయంత్రం అయ్యేసరికి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికిపోతుంది. గత ఆదివారం పగలంతా చక్కగా ఎండ వచ్చింది. సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా,భారీ వర్షం కురిసింది. అలాగే బుధవారం ఉదయం సూర్యుడు చక్కగా ప్రకాశించాడు.

రాత్రి ఎనిమిదగంటల నుంచి 11 గంటల వరకు ఎడతెరపి లేకుండా వర్షంకురిసింది. దీంతో సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని పలు కాలనీలు నీటమునిగాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.సరిగ్గా ఉద్యోగులు తమ డ్యూటీలను ముగించుకుని ఇళ్లకు బయలుదేరుతున్న సమయంలో వాన దంచికొడున్నది. దీంతో వాననీరు రోడ్లపై ప్రవహిస్తూ, ఎక్కడక్కడే ట్రాఫిక్ (Traffic) స్తంభించిపోతున్నది. దీంతో వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు గంటల సమయం పడుతున్నది.

రికార్డుస్థాయిలో వర్షం

హైదరాబాద్ లో బుధవారం రాత్రి కురిసిన మూడు, నాలుగు గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్ లోని ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్ (Old CBI Quarters) లోని పలు కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. మోకాళ్లలోతులో నీరు నిలిచిపోయింది.

 Hyderabad

పలు అపార్టుమెంట్లు వాసులు మోటర్ల ద్వారా నీటిని,బయటకు పంపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇళ్లలోని వస్తువులు, నిత్యావసర సరుకులు తడిసిపోయాయి. ఇండ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.

జలదిగ్బంధంలో చిక్కుకున్న బాగ్లింగంపల్లి

హుస్సేన్ సాగర్ నాలా (Hussain Sagar Nala) నీటితో బాగ్లింగంపల్లి పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. నడుము లోతు నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వరద చేరడంతో ఇంటివస్తువులు నీటిలో మునిగిపోయాయి. దీంతో హైడ్రా అధికారులు (Hydra officers) మోటార్లసాయంతో నీటిని తొలగిస్తున్నారు.

నీటిప్రవాహంలో కొట్టుకుపోయి ఓ వ్యక్తి మృతి

బల్కంపేట అండర్ బ్రిడ్జి వద్ద మొహమ్మద్ షరీపుద్దీన్ అనే వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. ముషీరాబాద్ కు చెందిన షరీపుద్ధీన్ డ్యూటీ నుంచి ఇంటికి,తిరిగి వస్తుండగా బల్కంపేట అండర్పాస్ బ్రిడ్జి వద్ద బైక్ తో సహా కొట్టుకుపోయాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hyderabad-rains-heavy-downpour-one-dead-two-missing/telangana/549678/

Breaking News city under stress continuous rains heavy evening showers hyderabad latest news sunny mornings Telugu News unpredictable weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.