📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: OG Movie – ఓజీ సినిమా పై అంబటి రాంబాబు ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: September 23, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం (OG Movie) ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలతో ఇప్పటికే పెద్ద ఎగ్జైట్మెంట్ నెలకొంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ట్రైలర్ రిలీజ్ తరువాతే ‘ఓజీ’ కి ఉన్న హైప్ గరిష్టానికి చేరింది. నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ‘ఓజీ’ సినిమా ప్రీమియర్ షోల కోసం ప్రత్యేక అనుమతులు ఇవ్వడం విశేషం. ఈ అనుమతులు, సినిమా హిట్టు సాధనలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అవుతుందన్న ఇంప్రెషన్ కలిగించాయి. బుధవారం రాత్రే ప్రధాన నగరాల్లో ప్రీమియర్ షోలు పడనున్నాయి.  సినిమా రిలీజ్ తరువాత,, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ కూడా నెలకొంది.

అంబటి రాంబాబు వ్యాఖ్యలు హాట్‌టాపిక్

తాజాగా ఈ సినిమాపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.‘పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. దానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు నటించిన రెండు చిత్రాలు బ్రో, హరిహర వీరమల్లు అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి.

అందువల్లే ‘ఓజీ’ సినిమా కచ్చితంగా విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ కసితో పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం. దాంతో పాటు డైరెక్టర్ గత రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. కాబట్టి ఈ చిత్రాన్ని హిట్ చేయాలని ఆయన గట్టి పట్టుదల కలిగి ఉంటాడు. మూడోది చిత్ర నిర్మాత దానయ్య (DVV Danayya). ఈ చిత్రం హిట్టు కొట్టాలని ఆయన ఖర్చుకి వెనకాడలేదు. ఇన్ని పట్టుదలల మధ్య జరిగిన నిర్మించిన ఈ చిత్రం కొంత మెరుగైన ఫలితాలు ఇస్తాయని నమ్ముతున్నా.

‘ఓజీ’ కచ్చితంగా విజయం సాధిస్తుందని

ఆ నమ్మకంతో ‘ఓజీ’ కచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నాను. ‘హరిహర వీరమల్లు’ చిత్రం హడావుడిగా తీశారు. అనుకున్న స్థాయిలో గ్రాఫిక్స్ చేయలేకపోయారు. చివరికి సినిమా విడుదలైతే చాలు అన్న పరిస్థితుల్లో షూటింగ్ జరిగింది. ‘ఓజీ’ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్ని కూడా పక్కనబెట్టి తీసిన సినిమా. 

అందువల్ల కచ్చితంగా విజయవంతం కావాలని నా కోరిక. పవన్ కళ్యాణ్ సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయంగా ఆయన మాకు ప్రత్యర్థి కాబట్టి విమర్శిస్తుంటాం. అవి కూడా సద్విమర్శలే చేస్తాం’ అంటూ అంబటి రాంబాబు వీడియోలో పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

ambati rambabu Breaking News DVV Entertainments former minister latest news Movie Reviews OG Movie Pawan Kalyan sujeeth Telugu News YSRCP leader

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.