📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : West Asia: పశ్చిమాసియా పరవశం!

Author Icon By Sudha
Updated: October 15, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పుడక్కడ తుపాకీ పేలుళ్లు, మిస్సైళ్ల గర్జ నలు వినపడవు. కనపడేవన్నీ ఉద్విగ్న సన్ని వేశాలు. ఆత్మీయ పలకరింపుల మధ్య ఇజ్రా యెలీ బందీల ఆనందబాష్పాలు, హమాస్ చెర నుంచి విడుదలైన ఇజ్రాయెలీలు కాని, ఇజ్రాయెల్ విడుదల చేసిన 1968 మంది పాలస్తీనియన్లు ఒక్కసారిగా ఇలాంటి మధురక్షణాలను చవి చూశారు. ఇంతకాలం బందీలుగా నాలుగు గోడల మధ్య ఇక చివరి రోజులేనను కున్న తరుణంలో ఒక్కసారిగా వారిలో కాంతిరేఖ ప్రసరిం చింది. పశ్చిమాసియా (West Asia)లోనవోదయం వెలుగు చూసింది. 738 రోజులు చీకట్లో మగ్గినవారు ఇప్పుడు స్వేచ్ఛాజీవులు. పశ్చిమాసియా (West Asia)లో శాంతికపోతాలు ఎగురు తున్నాయడానికివే సాక్షీభూతాలు. ఈసారి యుద్ధవిరమణ తంత్రంలో శ్వేతసౌధాధినేత ట్రంప్డే పైచేయి. ఎవరేమనుకున్నా హమాస్, ఇజ్రయెల్ల మధ్య సంధి కుదర్చడ మంటే మాటలు కాదు. ఇరుపక్షాల వారు ఒకరిపై ఒకరు రగిలిపోతున్నారు. వారి మద్య కుదిరిన శాంతి ఒప్పందాలలో భాగంగా తొలిదశలో ఇరుపక్షాలు సోమవారం బందీ లను పరస్పరం విడుదల చేశాయి. సజీవంగానైనా, నిర్జీ వంగానైనా సరే ‘మా వాళ్లు మాక్కావాలన్న’ ధోరణిలో ఇజ్రాయెల్ పట్టుపట్టడంతో తొలి విడతగా తమ ఆధీనం లో ఉన్న 20మందిని సజీవంగా గాజా మూడు ప్రాంతా ల నుంచి రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. పాలస్తీనా ఖైదీల విడుదల ప్రక్రియ కూడా సజావుగానే సాగింది. ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న వెస్ట్ బ్యాంక్ లోని పలు జైళ్లలో బందీగా ఉన్న పాలస్తీనియన్లు తమ ఆత్మీయుల ను కలుసుకోగలరు. ఈ శాంతి ఒప్పందం అమలయ్యే వరకు హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెలీలు కాని, ఇటు వెస్ట్ బ్యాంక్లో మగ్గుతున్న పాలస్తీనియన్లు కానీ తాము సజీవంగా బయటపడతామని ఏనాడూ అనుకోలేదు. ఇక మానవతాసాయం కూడా అనుకున్నట్లుగానే ఏర్పాట్లు జరిగాయి. గాజా పునర్నిర్మాణానికి సహాయం చేస్తామని, పాలస్తీనీయులు ఉగ్రవాదాన్ని, హింసను వదిలిపెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హమాస్ను హెచ్చరిస్తూనే ఉగ్రవాదంపై ఇజ్రాయెల్ విజయం సాధించినట్లు ప్రకటించారు. ఇరుపక్షాల మధ్య శాంతి ఒప్పందం అమలు, సయోధ్యకు సంపూర్ణ స్థాయిలో సిద్ధం చేయడం వంటి అంశాల పర్యవేక్షణకు ట్రంప్ స్వయంగా ఈజిప్టుకు హాజ రవడం విశేషించదగినది. ట్రంప్ మధ్యవర్తిత్వానికి కృతజ్ఞతగా ఈజిప్ట్ పార్ల మెంట్లో ఆయనకు సభ్యులం తా నిలబడి ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. అదే అత్యున్నత గౌరవం.ఇది చరిత్రలోనే లిఖించదగిన విషయం. గాజా స్ట్రిప్ను మరుభూమిగా మార్చిన రెండేళ్ల యుద్ధానికి ఎలాగైతేనేం తెరపడింది. అది తాత్కాలికమా? శాశ్వతమా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. కాలమే నిర్ణయిస్తుంది. పాలస్తీనా ప్రాంతానికి చెందిన పాలస్తీనియన్లు విడుదలై ఊపిరి పీల్చుకుంటు న్నారు. తమ తమ ఇళ్లకు చేరుకునే సరికి అవి శిధిలమై, కూలిన భవనాలను, కూల్చిన ఇళ్లను చూసుకుని బావురు మం టున్నారు. గాజా, ఇజ్రాయెల్ల మధ్య తుదిఒప్పం దాలు కుదిరి అమల్లోకి వచ్చేవరకు శాంతిని నెలకొల్పడానికి తాను కట్టుబడి ఉంటానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ప్రకటిం చడమే ఈ ఒప్పంద సారాంశం. నెతన్యాహు ఎంతకైనా తెగిస్తాడని ప్రతీతి. అతనే స్వీయనిర్ణయాన్ని నిర్ద్వందంగా ప్రకటించారని హమాస్ నేతలు నమ్మి ముందుకు రావ డం అటుఇటూ ఇరుపక్షాలను శాంతిమార్గంలో పయనింప చేసేందుకు మార్గం సుగమమయ్యింది. ఇక ముందు గాజాను నిస్సైనికీకరణ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ శాంతి ఒప్పందా ల నేపథ్యం కనపడుతోంది. ఎవరెంతగా పోరాడారు. ఎవరి లక్ష్యాలు ఏమిటి? ఎవరు విజతలయ్యార నేది ట్రంప్ చెప్పినంత సులభం కాదు. ఇరువర్గాలు భారీ గానే నష్టపోయాయి. జననష్టం, ఆస్తినష్టాల విషయాని కొస్తే ఇజ్రాయెల్ దాడుల్లో 67,800 మంది చనిపోయారు. వారిలో సగం మందికి పైగా మహిళలు, చిన్నారులే. ఇప్పటి శాంతి ఒప్పందంతో తమసొంత ప్రాంతాల్లోనే బందీలుగా ఉన్న పాలస్తీనియన్లకు స్వేచ్ఛ వచ్చినందుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియాగుటెరస్ ఎంతో సంతోషం వ్యక్తంచేశారు. యుద్ధాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఇకపై గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్లు శాంతి ధామాలని ట్రంప్ స్వయంగా ప్రకటించారు.అంతే తప్ప ఈ దేశాల మధ్య యుద్ధానికి ప్రధాన కారణమైన ‘పాలస్తీనా అంశంపై ట్రంప్ ఏమీ మాట్లాడలేదు. దీనిపై ఎలాంటి ఒప్పందమూ జరుగలేదు. కాల్పుల విరమణ అన్నది ప్రధానాంశం. అయితే గాజా పునర్నిర్మాణం కోసం సుమారు రూ.4.7 లక్షల కోట్లఅవసరమౌతుందన్న అంచనాలు వేశారు. అన్నీ ఇజ్రాయెల్ నేతృత్వంలోనే జరుగుతాయన్నది సుస్పష్టం. కాగా “హమా ‘స్’ దళాలకు ఎలాంటి పని చెప్పకుండా గాజాలో పాలస్తీనా భద్రతా దళాల్ని ఏర్పాటు చేయమన్నారు. అంటేపాలస్తీనా సమస్యకు పరిష్కారం లభించనట్లే! ప్రత్యేక ‘పాలస్తీనా’ ఏర్పాటు అన్నది హమాస్ ఆకాంక్ష. శాంతి ఒప్పందాలు స్వాగతించదగినవే. ఇరుపక్షాలు శషభిషలు లేకుండా వాటి అమలు చేయడమూ మంచిదే. గాజా అంటే అతిచిన్న ప్రాంతం. ఈ యుద్ధంలో పరమ కిరాతంగా ఊచకోతకోసిన చరిత్ర ఇజ్రాయెల్దే. ఒకనాటి ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు 56 శాతం భూభాగం ఇజ్రాయెల్టి కాగా 43 శాతం భూభాగం పాలస్తీనాకివ్వాలి. కానీ నిన్న మొన్నటి యుద్ధంలో ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించు కుంది. పాలస్తీనా ప్రజల్లో అశాంతికి మూలకారణమయ్యిం ది. ఈ వివాదాలు ముగిసి పాలస్తీనాకు స్వతంత్ర దేశంగా గుర్తించబడినప్పుడే అక్కడ పూర్తిస్థాయి శాంతి నెలకొల్పినట్లవుతుంది. దానికోసం ఎదురు చూడాల్సిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Geopolitics International Relations latest news Middle East Telugu News West Asia West Asia Conflict

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.