📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Welfare : అటిజం విద్యార్థులకు ఆసరా … 125 కేంద్రాల ఏర్పాట్లు

Author Icon By Shravan
Updated: August 18, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: రాష్ట్రం లోని విభిన్న ప్రతిభావంతులకు చదువు నేర్పడంతో పాటు వారి భవితకు బాటలు వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక కార్యచరణ అమలె చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ (SSA) కృషి చేస్తోంది. ఇలాంటి విద్యార్థులను సాధారణ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా వారికి సమాన అవకాశాలు కల్పిస్తోంది. ట్యాబ్లలో 33 రకాల యాప్లను ఇన్సాల్ట్ చేసి, బోధన చేయిస్తోంది. ఫ్యామిలీ యాప్కు పిల్లల ఐడీని లింక్ చేయడం ద్వారా విద్యార్థి ఎంత సేపు యాప్ ఉపయోగించారో పర్యవేక్షిస్తున్నారు. దివ్యాంగ విద్యార్థుల అభ్యున్నతి కోసం ఇప్పటికే 679 భవిత కేంద్రాలు ఏర్పాటు చేయగా… దేశంలో తొలిసారి అటిజం పిల్లల కోసం పట్టణాల్లో 125 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 85,046 మంది ప్రత్యేకావసరాలు కల్గిన విద్యార్థులకు ప్రత్యేక విద్యను అందిస్తున్నారు. ఏటా బడి బయట ఉన్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించేందుకు సర్వే చేస్తారు. గుర్తించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేస్తున్నారు. భవిత కేంద్రాల్లో పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీలతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో చెప్పిస్తున్నారు. తీవ్రమైన వైకల్యంతో పాఠశాలలకు రాలేని పిల్లలకు ప్రతి శనివారం వారి ఇంట్లోనే బోధన చేస్తున్నారు. చదువుకు సహాయంగా భత్యంగా ఇస్తున్నారు.

దివ్యాంగ పిల్లలకు నెలకు రూ.600 చొప్పున రవాణా భత్యాన్ని అందిస్తున్నారు

ప్రాథమిక స్థాయిలో 3,932, సెకండరీ స్థాయిలో 4,058 మందికి ఈ భత్యాన్ని ఇస్తున్నారు. బాలికలకు నెలకు రూ.200 అదనంగా ఇస్తున్నారు. సొంతంగా బడికి రాలేని వారికి సహాయకుల భత్యాన్ని అందిస్తున్నారు. 1-8 తరగుల్లో నమోదై 40% హాజరు ఉన్న పిల్లల సహాయకులకు నెలకు రూ.600 చొప్పున ఇస్తున్నారు. ఇంటివద్దనే ఉండే వారికి పది నెలలకు రూ.3 వేలు ఇస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో 6,790 మంది ఈ సహాయాన్ని పొందుతున్నారు. వారంలో 3 రోజులు (3 Days) ఫిజియోథెరపి స్టులు భవిత కేంద్రాలను సందర్శించి సేవలు అందిస్తున్నారు. క్రీడల కోసం ప్రత్యేకంగా జిల్లాకు రూ. లక్ష వరకు వ్యయం చేస్తున్నారు. భవిత కేంద్రాల్లో రూ.7వేల చొప్పున గౌరవ వేతనమిస్తూ సహాయకులను నియమించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/cybercriminals-are-looting-people-on-the-pretext-of-renting/crime/532044/

Autism Care Breaking News in Telugu Disability Support Latest News in Telugu Special Education Programs Special Needs Education Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.