📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Satya Jyoti: రోడ్డు ప్రమాదంలో వెయిట్‌లిఫ్టర్ సత్యజ్యోతి మృతి

Author Icon By Anusha
Updated: November 16, 2025 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకం సాధించాలని వెళుతున్న ఓ క్రీడాకారిణిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వెయిట్‌లిఫ్టర్ తాడుతూరి సత్యజ్యోతి (Satya Jyoti) (26) అక్కడికక్కడే మృతి చెందింది.

Read Also: IND vs SA: కుప్పకూలిన సౌతాఫ్రికా.. టీమిండియా టార్గెట్ 124

వెయిట్‌లిఫ్టంగ్ పోటీల్లో సత్తాచాటి రాష్ట్రానికి పతకం తేవాలనే ఆశతో ఇంటి నుంచి బయలు దేరిన సత్యజ్యోతిని.. లారీ రూపంలో మృత్యువు పలకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం సత్యజ్యోతి రైల్వేలో టిక్కెట్టు కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నారు. అలానే వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో కూడా పాల్గొంటున్నారు.

దీనిలో భాగంగానే.. ప్రస్తుతం విజయనగరం జిల్లా, కొండవెలగాడ గ్రామంలో ప్రస్తుతం నిర్వహిస్తోన్న రాష్ట్రస్థాయి సీనియర్స్ టోర్నమెంటులో పాల్గొనేందుకు గాను సత్యజ్యోతి (Satya Jyoti).. తన సోదరి, ప్రభుత్వ స్కూల్ టీచర్ అయినా సరోజని గాయత్రితో కలిసి స్కూటీ మీద శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరింది.

చివరి సంతానమైన సత్యజ్యోతి జాతీయ వెయిట్‌లిఫ్టింగ్

ఈక్రమంలో వీరికి ఎదురుగా వస్తున్న లారీ.. స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యజ్యోతి అక్కడికక్కడే చనిపోగా.. ఆమె సోదరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన లారీ డ్రైవర్ పరారయ్యాడు.కుటుంబ వివరాలకు వస్తే… భాస్కరరావు, యశోదమ్మీ దంపతుల కుమార్తె సత్యజ్యోతి. వీరికి నలుగురు ఆడపిల్లలు సంతారం. వీరిలో పెద్ద కుమార్తె సంజీవని వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు.

రెండో కూతురు సతీమూలు సచివాలయం ఉద్యోగి.. కాగా మూడో అమ్మాయి సరోజిని గాయత్రి స్కూల్ పీడీగా పనిచేస్తున్నారు. చివరి సంతానమైన సత్యజ్యోతి జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ పోటిల్లో రాణించి.. ఏడాదిన్నర క్రితమే క్రీడా కోటాలో రైల్వేలో ఉద్యోగం సాధించారు. మరెన్నో పతకాలు గెలుస్తుందని భావించిన సత్యజ్యోతి ఇలా అర్ధాంతరంగా కన్ను మూయడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AP News latest news Satya Jyoti Telugu News Vizianagaram accident weightlifter death

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.