Weather : దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరప్రాంతంపై అల్పపీడనం కొనసాగు తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడింది. ఈ అల్పపీడనం మరో 24 గంటల్లో (24 hours) వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్యతీర ప్రాంతాన్ని దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి సవ్వడి తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే విశాఖపట్నం, అనకాపల్లి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ప్రకటించారు. అదే సమయంలో, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఐఎండి సూచనల ప్రకారం దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మరోకు అల్పపీడనం.. ఏర్పడే అవకాశం ఉందన్నారు.
వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు కోస్తాలో చెదురుమదురుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు… భారీవర్షాల నేపధ్యంలో ప్రజలు చెట్లక్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోను పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :