తెలుగు రాష్ట్రాల్లో చలి (Weather) తీవ్రత నానాటికీ పెరిగిపోతుంది.పది రోజులుగా చలి ప్రభావం విపరీతంగా పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా మన్యం జిల్లాల్లో చలి చంపేస్తోంది. ఇక్కడ నీరు గడ్డకడుతుందంటే.. చలి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు.
Read Also: AP: స్మార్ట్ రేషన్ కార్డుల ఉచిత పంపిణీకి రేపే లాస్ట్ డేట్
మరో వారం రోజులు చలి గాలుల తీవ్రత
ఉదయం, సాయంత్రం ప్రయాణాలు మానుకోవాలని.. మరీ ముఖ్యంగా మన్యం జిల్లా వాసులు పొగ మంచు కారణంగా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మన్యం జిల్లాలో, పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు (Weather) నమోదవుతున్నాయి. పాడేరు, అరకు ప్రాంతాల్లో.. 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వడంతో.. ఈ ప్రాంతాల్లో నీరు గడ్డకడుతోంది. వ్యవసాయ భూముల్లో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో.. రైతులు ఉదయాన్నే పొలాల వైపు వెళ్లలేకపోతున్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మినుములూరులో 4 డిగ్రీలు, చింతపల్లిలో 5.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యం ఏరియాలో ఉదయం 9 గంటలు దాటినా మంచు తెరలు వీడటం లేదు.అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందిన గోదావరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. పగటి పూట ఎండ బాగానే కాసినా.. చలిగాలుల ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. మరో వారం రోజులు చలి గాలుల తీవ్రత ఇలానే కొనసాగుతుందని కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: