📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Weather alert: దంచికొడుతున్న వర్షాలతో ప్రజల ఇక్కట్లు

Author Icon By Ramya
Updated: July 26, 2025 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Weather alert: గతవారం రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెడపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం ఉదయం నుంచే ఏమాత్రం గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, కళాశాల వెళ్లేవారు సైతం ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో మరో రెండు రోజులు రెండు తెలుగురాష్ట్రాలకు వర్షాలు తప్పవని ఇప్పటికే హైదరాబాద్లోని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ ను ప్రకటించింది. రోడ్లపై నీటితో ట్రాఫిక్ జామ్ కాగా వర్షపునీరు, డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. గంటలకొద్దీ వాహనాలు రోడ్లపై నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాలాలు, డ్రైనేజీకాలువులు పొంగిపొర్లుతున్నాయి.

Weather alert: దంచికొడుతున్న వర్షాలతో ప్రజల ఇక్కట్లు

వర్షాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న అధికారులు

Weather alert: హైదరాబాద్లో జీహెచ్ఎంసి (GHMC) అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లీయర్ చేసేందుకు యత్నిస్తూనే ఉంది. అయినా ట్రాఫిక్ సమస్యలు తీరడం లేదు. సాయంత్రం సమయంలో అధికంగా వర్షాలు కురుస్తుండడంతో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఉద్యోగస్తులు వ్యతలు అంతా ఇంతా కాదు. మొన్నటివరకు వర్షాలు లేక, వర్షాల కోసం ఎదురుచూసిన రైతులు ఆనందంతో పంటసాగుకు పనులను మొదలుపెట్టారు. జాగ్రత్తగా ఉండాలి మరో రెండురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఊదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉండడంతో అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. పిల్లలు బయటకు రాకుండా చూడాలని కోరారు. ఈ సీజన్లో అంటువ్యాధులు, జ్వరాలకు అవకాశం ఉండడంతో బయటి ఆహారానికి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వాతావరణ హెచ్చరికలు ఎందుకు?

ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని ప్రజలను హెచ్చరించడానికి వాతావరణ శాఖ వాతావరణ హెచ్చరికలను జారీ చేస్తుంది. ఇది వర్షం, ఉరుములు, గాలి, మంచు, మెరుపులు, మంచు, విపరీతమైన వేడి మరియు పొగమంచు కావచ్చు.

తీవ్రమైన వాతావరణ హెచ్చరిక అంటే ఏమిటి?

తీవ్రమైన వాతావరణాన్ని స్పాటర్లు లేదా రాడార్ ద్వారా నివేదించారు. ప్రాణాలకు మరియు ఆస్తికి ప్రమాదం ఉందని హెచ్చరికలు సూచిస్తున్నాయి . గణనీయమైన భవనంలో ఆశ్రయం పొందండి. బలమైన గాలులకు ఎగిరిపోయే అవకాశం ఉన్న మొబైల్ ఇళ్ల నుండి బయటపడండి.

Read hindi news: hindi.vaartha.com

Read also: AP Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్.. వాతావరణ శాఖ హెచ్చరిక

Breaking News Hyderabad Weather latest news Monsoon Precautions rain warning Telangana Rains Telugu News traffic jam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.