Weather: బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

Read Time:  1 min
Telangana: Light rain in many places in Hyderabad
Telangana: Light rain in many places in Hyderabad
FONT SIZE
GET APP

బంగాళాఖాతంలో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఈ వాయుగుండం వచ్చే 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాలలో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Read also: AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్

Weather: A low-pressure area has formed in the Bay of Bengal... there is a possibility of rain
Weather: A low-pressure area has formed in the Bay of Bengal… there is a possibility of rain

అంచనా

మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలోని శ్రీలంక సమీపంలో మంగళవారం రోజున అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారుతుందంటున్న వాతావరణ శాఖ అధికారులు..

తమిళనాడు తీరం వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు. (Weather) ఫలితంగా రాష్ట్రంపై దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని చెప్తున్నారు. అయితే అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.