📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Latest News: Minister Gottipati: కరెంట్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి గొట్టిపాటి

Author Icon By Aanusha
Updated: November 6, 2025 • 9:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. ఈ నెల నుంచే కరెంట్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి (Minister Gottipati) రవికుమార్ ప్రకటించారు.గత ప్రభుత్వ హయాంలో విధించిన అధిక ఛార్జీల భారాన్ని తొలగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చౌడువాడ, కింతలి గ్రామాల్లో బుధవారం నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాలను మంత్రి ప్రారంభించారు.

Read Also: Minister Tummala: ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలను టీజీ లో కలపండి: తుమ్మల

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎఫ్‌పీపీ (ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు) ఛార్జీల రూపంలో యూనిట్‌కు 40 పైసలు అధికంగా వసూలు చేసి పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు.

ప్రస్తుతం ఆ ఛార్జీని 13 పైసలకు తగ్గిస్తున్నామని, దీనివల్ల వినియోగదారులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి (Minister Gottipati) తెలిపారు.

Minister Gottipati

ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల

ఇందులో భాగంగా 11 జిల్లాల్లో రూ. 250 కోట్ల వ్యయంతో 69 కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు, రాష్ట్రంలోని 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఉచితంగా సౌరవిద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల విద్యుదాఘాతానికి గురై మరణించిన ఇద్దరి కుటుంబ సభ్యులకు మంత్రి గొట్టిపాటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AndhraPradesh ElectricityBills EnergyDepartment GottipatiRavikumar latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.