📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala Gas Shortage: తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

Author Icon By Aanusha
Updated: March 17, 2026 • 11:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala Gas Shortage: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తిరుమల కొండపై ఉన్న సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో, ఫలితంగా తిరుమలలోని ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూతపడే పరిస్థితి నెలకొంది.

Read Also: Andhra Pradesh Weather: ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

స్తంభించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలు

తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులు టీ, కాఫీలు, అల్పాహారం (టిఫిన్) కోసం స్థానిక హోటళ్లు, చిన్న చిన్న టీ షాపులపై ఆధారపడుతుంటారు. వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు దొరకకపోవటంతో వ్యాపారాలను నడపటం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ షాపుల నిర్వాహకులకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలను మూసివేస్తున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ల కోసం గ్యాస్ గోడౌన్ల వద్ద హోటల్ నిర్వాహకులు బారులు తీరుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ షాపుల మూసివేతతో భక్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.

War on Tirumala: Hotels closed due to shortage of gas cylinders

వెంకన్న దర్శనం కోసం తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వేసవి సెలవులు, పండుగల సీజన్‌లలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే శ్రీవారి భక్తుల కోసం తిరుమలలో టీటీడీ నిర్వహించే నిత్యాన్నదాన కేంద్రాలతో పాటుగా.. పలు హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలిశాయి. వీటి ద్వారా భక్తులకు కావాల్సిన టిఫిన్లు, వెజిటబుల్ రుచులు అందిస్తున్నారు. వెంగమాంబ అన్నదాన కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించే భక్తులు.. కాఫీలు, టీలు , టిఫిన్లు వంటి వాటి కోసం తిరుమలలోని టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ షాపులపై ఆధారపడుతుంటారు. అయితే ఎల్పీజీ గ్యా్స్ కొరత కారణంగా వీటిని మూసివేస్తూ ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Commercial LPG Cylinders Middle East War Impact India Tirumala Gas Shortage TTD annaprasadam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.