📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

war : అంతర్యుద్ధమా! యుద్ధమా?

Author Icon By Sudha
Updated: January 13, 2026 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను సునాయాసంగా చెరసాల పాటేయడంలో విజయోత్సాహం, వీరగర్వంలో ఉన్న శ్వేతసౌదా ధిపతి ట్రంప్ ఇంకా ఆగేట్టు లేరు. కారణంలేకుండా విషయం చెప్పకుండా దేశంలోని ఇతర చిన్నాచితక దేశాలపై హుంకరించే ఆయన తాజాగా ఇరాన్ ను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే ప్రయత్నంలో పడ్డారు. అది సాధ్యమో అసాధ్యమో చెప్పలేం. కానీ ఇరాక్పై అమెరికా సమర సన్నాహాలు చేస్తోంది. ఇరాన్లో ఆదేశ సుప్రీం ఆయతుల్లా అలీ ఖొమెనీ ప్రభుత్వానికి అక్కడ ‘జె’ నిరసనలు వెల్లువెత్తిన విషయం విదితమే. ఆ నిరసనలపై ఇరాన్ పాలనాపర నిర్ణయం తీసుకొని వాటిని అణగదొ క్కేందుకు ప్రయత్నిస్తోంది. ఇరాన్ తిరగపడితే ఇదో పెద్ద సైజు యుద్ధం (war)లా మారే పరిస్థితి తలెత్తుతుంది. నిరసన కారులను అణగదొక్కడమనేది ఏ దేశంలోనైనా జరిగేదే! అందులో ప్రత్యేకత ఏమీ లేదు. పాలకులు పాలితుల మధ్య వైరుధ్యాలు ఏర్పడినప్పుడు ఇరు వర్గాలు సంయ మనం పాటిస్తుండటం అవసరం.
అదేలేనప్పుడు చిక్కులొస్తాయి. కానీ ఇక్కడ లాంటి పరిస్థితి ఏమీ లేదు. ఇరాన్ తన పాలన తను చేసుకుపోతూ ఉంది. వారి వ్యవహారాల్లో తలదూర్చడానికి అమెరికాకు ఏ అధికారమూలేదు. పెద్దన్నలా వ్యవహరించేందుకు పెత్తనం చేసేందుకు ఎలాంటి అధికారమూ లేదు. దాదాపు అన్ని దేశాలపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎగుమతులు దిగుమతులు స్థాయిని బట్టి సుంకాల వడ్డన చేస్తూ భయపెడుతోంది. అమెరికా సుంకాలు తట్టుకునే స్థాయిలో ఇండియా కూడా లేదు. స్వదేశీ తయారీకి ప్రాధాన్యతనిచ్చి అటువైపు దృష్టి సారిస్తే అమెరికా బెడద ఇండియాకు తప్పుతుందని ప్రధాని నరేంద్రమోడీ కూడా పిలుపునిచ్చారు. పరోక్షంగా చెప్పాలంటే ట్రంప్ చమురు బావులున్న దేశాలు, చమురు కొంటున్న దేశాలను గుర్తించి ‘చమురు’ వ్యాపారాన్ని తానే చేసే విధంగా వ్యూహాలు పన్నుతున్నారు. ఇలాంటివన్నీ చమురు కోసం కాదని చెప్పుకుంటున్నా చివరాఖరుకు తేలేది ‘చమురు’ నేపథ్యమే. ఇరాన్, అమెరికాల వైరుధ్యం తో సమిధలయ్యేది నిరసనకారులే. ఆ విషయాన్ని వారు గుర్తించడం లేదు. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం కొనసాగితే తాముచూస్తూ ఊరుకునేది లేదని, పరిమిత స్థాయిలో ఇరాన్పై దాడులు చేయనున్నట్లు అమెరికా పరోక్ష సంకేతాలిస్తోంది. ఇరాన్లో మళ్లీ రాచరిక వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని చేస్తు న్నట్లు ఆయన చర్యలే చెబుతున్నాయి. ఇరాన్ స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం ఎదురుచూస్తోందని ప్రజల్లో అలాంటి ఆకాంక్ష ఉన్నట్లు తాను గుర్తించానని ఆయన చెబుతున్నారు. అందుకే తాను వారి కోసం ఇరాన్ వ్యవహారాలపై జోక్యం చేసుకుంటున్నానని ట్రంప్ బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ హై ఎలర్ట్ కూడా ప్రకటించింది. వీటన్నిటినీ ఇరాన్ పార్లమెంట్ ఖండిస్తోంది. పార్లమెంట్ సభ్యులు డెత్యు అమెరికా’ అటు నినాదాలు కూడా చేసారు. స్పందనగా ఇరాన్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ కలిబఫ్ మాట్లాడుతూ అమెరికా సైన్యం, ఇజ్రాయెల్ తమలక్ష్యాలుగా మారుతాయని హెచ్చదించారు. తాము అమెరికా దుందుడుకు చర్యలను నిరసి స్తున్నామని, తామంటూ ప్రతిఘటిస్తే అమెరికన్ మిలి టరీపైన, ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగంపైనే తమ దాడు లుంటాయని ప్రటకించారు. ఇక ఇరాన్ నిరసన కారులను అదుపు చేయడంలో జరిపిన కాల్పుల్లో వందలాది మంది మరణిస్తున్నారు. ఇరాన్ దవాఖానాల్లో శవాల కుప్పలు కుప్పలుగా పేరుకుంటున్నాయి. ఇవి దాదాపు 600 మం దికిపైగానే ఉంటాయని అంచనా. ఆందోళనకారుల్ని సైన్యం తీవ్రంగా అణచివేస్తోంది. ఇరాన్లో జరుగుతున్నది అంత ర్యుద్ధంలానే భావించాలి. నిత్యావసర వస్తువులు నింగినంటడం, పెచ్చు పెరిగిన అవినీతి. అస్తవ్యస్త పాలన వెరసి ఆయాతుల్లా ఖోమెనీపై జనం తిరగ పడుతున్నారు. ఇది ఇరాన్ ప్రజల్లోంచి పెల్లుబికిన ఆగ్రహం తాలూకు నిరసన ప్రదర్శనలుజరుగుతున్నాయి. ఖమేనీ పాలన అంతం కావాలని కోరుకుంటున్నారు. వారిలోని ఆగ్రహాన్ని చల్లా ర్చేందుకు పాలకులు ఏమాత్రం చర్యలు తీసుకోవడంలేదు. సరిగదా! సైన్యాన్ని వారి మీదకు ఉసికొల్పడం ఇరాన్లో కనపడుతున్న విచిత్ర విధ్వంస సన్నివేశాలు. ఇరాన్ ప్రజలపై ఖమెనీ ప్రభుత్వం విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపిస్తోందని ట్రంప్ వాపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతిఒక్కరికీ అత్యంత కఠినమైన శిక్షలు విధిస్తాం. అలాంటి వాళ్లంతా దేవునికి శత్రువులే కనుక వారిని వధిస్తాం. కఠిన శిక్షవేస్తాం అని ఇరాన్ అటార్నీ జనరల్ మొహ్మద్ మొహ హెదీ అజాద్ ఆందోళనకారుల్నిహెచ్చరించినట్లుగానే వారి దుశ్చర్యలు ఉన్నాయి. దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్ల యింది. ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశాన్ని వీడిన ఇరాన్ యువరాజు రెజా పహ్లాలి ఆఘమేఘాల మీద ఇరాన్లో తాను కూడా ఉద్యమకారునిగా మారుతానంటూ ఇరాన్ ప్రధాని లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఆయనకు అమెరికా పరోక్ష మద్దతునీయడంతో ఇరాన్ ప్రభుత్వ వైఫల్యాలు ఆ దేశాన్ని ఎంతవరకు తీసు కెళ్తాయో వేచిచూడాలి. ఒకపక్క గ్రీన్ లాండ్ ఆక్రమణకు ప్లాన్ వేస్తున్న ట్రంప్క్యూబా, కొలంబియాలపై స్వారీ చేయాలనిసన్నద్ధమవుతున్నారు. ఇరాన్లో జరుగుతున్న నిరసనలు అమెరికా వత్తాసుతో అంతర్యుద్ధానికి ప్రేరేపిత మవుతుందా? లేదు అమెరికాయే ఇరాన్పై నేరుగా యుద్ధం (war)ప్రకటిస్తుందా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ ట్రంప్ దూకుడు యావత్తు ప్రపంచానికి తెలిసిందే. ఇరాన్కు అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఓ కీలక హెచ్చరిక విడుదలైంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BreakingNews civil war Conflict international war latest news Telugu News violence war

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.