Vizianagaram Bus Accident: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక భయానక ప్రమాదం చోటుచేసుకుంది. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలి బూడిదైంది. అయితే, డ్రైవర్ అప్రమత్తత కారణంగా ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటన రామభద్రపురం మండలంలోని తారాపురం గ్రామ సమీపంలో జరిగింది.
Read Also: Chandrababu-Tirumala: శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం
Vizianagaram Bus Accident: టైరు పేలడంతో చెలరేగిన మంటలు
వివరాల్లోకి వెళ్తే, ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరికి వెళ్తోంది. రామభద్రపురం మండలం తారాపురం వద్దకు రాగానే బస్సు వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో వెలువడిన నిప్పురవ్వల వల్ల బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన డ్రైవర్ దశరథ్, క్షణాల్లో నిర్ణయం తీసుకుని బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు.
డ్రైవర్ సమయస్ఫూర్తి.. ప్రయాణికులందరూ సేఫ్
మంటలు వ్యాపించకముందే డ్రైవర్ ప్రయాణికులందరినీ అప్రమత్తం చేసి కిందకు దించేశారు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించి, వాహనం పూర్తిగా దగ్ధం అయిపోయింది.. ఒకవేళ డ్రైవర్ స్పందించడం కొంచెం ఆలస్యమైనా భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
బస్సులో ఒడిశా ఎమ్మెల్యే?
ప్రమాద సమయంలో బస్సులో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లగేజీ కాలిపోయినప్పటికీ, ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: