ఆంధ్రప్రదేశ్ (AP), లోని విజయనగరం (Vizianagaram) జిల్లా ఎస్.కోటలో హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు నివాసంలో ఏసీబీ తనిఖీలు చేసింది. అక్రమ సంపాదనతో రూ.20 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.శ్రీనివాసరావు సుమారు 15 ఏళ్లుగా హోంగార్డుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
Read Also: Ajit Pawar: బారామతిలో నిర్వహించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో మంత్రి లోకేశ్
ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా సంపాదించారు?
హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు నివాసంతో పాటు, ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏసీబీ ప్రత్యేక బృందాలు రికార్డులను పరిశీలిస్తున్నాయి. శ్రీనివాసరావు ఏకంగా రూ.20 కోట్ల మేర ఆస్తుల్ని కూడబెట్టినట్లు చెబుతున్నారు.. సాధారణ హోంగార్డు ఉద్యోగం చేసే వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా సంపాదించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ అధికారులు రైడ్స్‌పై కొందరికి ముందుగానే సమాచారం ఇచ్చి క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: