ACB Raid in Vizianagaram: లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయిన విఆర్వో

Read Time:  1 min
ACB Raid in Vizianagaram: లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయిన విఆర్వో
ACB Raid in Vizianagaram: లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయిన విఆర్వో
FONT SIZE
GET APP

ACB Raid in Vizianagaram: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. సవరవిల్లి గ్రామానికి చెందిన వీఆర్వో (చాకివలస ఇంచార్జి), తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ పరమైన ‘మ్యూటేషన్’ పనులు చేసేందుకు చాకివలసకు చెందిన రైతు లంక బంగారు నాయుడు నుండి భారీగా లంచం డిమాండ్ చేశారు. సదరు రైతు పని పూర్తి చేయడానికి వీఆర్వో ఏకంగా మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు.

Read Also: CM Chandrababu Vizianagaram Visit: ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు:రాంసుందర్ రెడ్డి

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

రైతు తాను అంత మొత్తాన్ని ఇచ్చుకోలేనని బ్రతిమిలాడినా వీఆర్వో కనికరం చూపలేదు. డబ్బు ఇస్తేనే పని అవుతుందని తెగేసి చెప్పడంతో, విసిగిపోయిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల వ్యూహం ప్రకారం.. సోమవారం సాయంత్రం రైతు నుండి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం వీఆర్వోను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

ACB Raid in Vizianagaram: రెవెన్యూ శాఖలో గుబులు

ఈ దాడితో భోగాపురం తాసిల్దార్ కార్యాలయం సహా జిల్లాలోని రెవెన్యూ వర్గాల్లో ఒక్కసారిగా గుబులు మొదలైంది. ఏసీబీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లంచం అడిగితే ఎవరైనా 1064 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు సూచించారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.