📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vizag Tourism: ఏపీ పర్యాటక కీర్తి కిరీటంగా విశాఖ

Author Icon By Tejaswini Y
Updated: February 25, 2026 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vizag Tourism: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో విశాఖపట్నం ఒక కలికితురాయి అని, దానిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్. వంశీ కృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి కందుల దుర్గేష్ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. నూతన పర్యాటక పాలసీ (2024-29)తో విశాఖను యాంకర్ హబ్ చేస్తూ హబ్ అండ్ స్పోక్ మోడల్లో సింహాచలం, బౌద్ధ, బీచ్, ఎకో టూరిజం థీమాటిక్ సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.

Read Also: Save Punarvika: పునర్విక కోసం కదిలిన హృదయాలు..16 కోట్ల మనీ కలెక్షన్

Vizag Tourism: Visakhapatnam is the crowning glory of AP tourism

ఇటీవల జరిగిన సీఐఐ సమ్మిట్ ద్వారా రూ.8,650కోట్ల విలువైన 50 ఒప్పందాలు కుదిరా యని, తద్వారా ఒబేరాయ్, తాజ్, మేఫెర్, అట్నాస్పి యర్ కోర్ వంటి ప్రముఖ హోటల్ సంస్థలు విశాఖకు వస్తున్నాయన్నారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 16 ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింద న్నారు. తద్వారా విశాఖలో 2858 రూమ్ల ఏర్పాటు కు రూ.4098 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిం దన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ ద్వారా సింహా చలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి రూ.54.04 కోట్లు, స్వదేశీ దర్శన్ 2.0 కింద బొర్రా గుహల అభివృద్ధికి రూ. 28.87 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేశామన్నారు.

రుషికొండ, తిమ్మా పురం, సాగర్ నగర్ బీచ్, భీమిలి దగ్గర గోస్తనీ బ్యాక్ వాటర్స్ తదితర ప్రాంతాల్లో స్కూబా డైవింగ్, పారా మోటరింగ్ వంటి 10 రకాల జలక్రీడలు ప్రారంభమ య్యాయన్నారు. 6 నెలల్లో 25 కంటే ఎక్కువ కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు. విశాఖలో ప్రభుత్వం, ట్రావెల్ మార్ట్తో కలిసి తొట్లకొండ, బావికొండ లను కలుపుతూ బౌద్ధ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్లాన్చేస్తోందన్నారు. భువనేశ్వర్, కోల్కత్తా, విశాఖపట్నం, చెన్నై ట్యూటికోరన్ను సీ క్రూజ్ సర్క్యూట్గా ఏర్పాటు చేయాలని ప్రతి పాదన చేశామన్నారు.

విశాఖ-అరకు సీ ప్లేన్, హెలీ టూరిజం, విశాఖ- చెన్నై- పుదచ్చేరి(Visakhapatnam-Chennai-Puducherry) క్రూజ్ సర్వీసులను బలోపేతం చేస్తున్నామన్నారు. హైదరాబాద్- విశాఖపట్నం మధ్యలో క్వార వాన్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో క్యారవాన్ పాక్స్లు ఏర్పాటు చేస్తామ న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో విశాఖ నుండి భీమిలీకి మధ్య ఉన్న సందర్శక ప్రాంతాలన్నీ పర్యాటకుడు సందర్శించేలా ప్రారంభించబడిన హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సుల ద్వారా సత్ఫలి తాలు వస్తున్నాయన్నారు.

భారత్ మండపం తరహాలో ఎపిలో ఆంధ్రా మండపాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. తద్వారా విశాఖలోని బీచ్లను అభివృద్ధి చేయాలని, విశాఖలోని ఎకనమిక్ రీజియన్ క్రింద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నా మన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాడ్జ్లు పర్యాటక రంగానికి పారిశ్రా మిక హోదా కల్పించడం ఈ రంగానికి ఊతమిచ్చినట్లు అయ్యిందన్నారు. తద్వారా స్థానికులకు ఉపాధి కల్పించేలా హోమ్ స్టే పాలసీ, ట్రెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానం తీసుకొచ్చి 490 హోమ్ స్టేలను ఏర్పాటు చేస్తున్నా మని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.

సిఆర్ జెడ్ నిబంధనలపై స్పష్టత

ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు కోరిన విధంగా బీచ్ రోడ్డులో నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న సీఆర్ జెడ్ జోన్ 3 నుండి జోన్ 28 మార్చే అంశాన్ని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ‘సిఆర్ జెడ్ 19’ అమల్లోకి వస్తే పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా తమ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, పర్యాటకులు విదేశాలకు వెళ్లకుండా విశాఖలోనే అంతర్జాతీయ స్థాయి. తర్వాత కుదేలైన పర్యాటక రంగాన్ని మళ్లీ పట్టాలెక్కిం ఎంటర్ టైన్మెంట్ హబ్ ఏర్పాటు చేయాలని సూచిం చారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చామని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా పునరుద్దా టించారు. ఈ క్రమంలో విశాఖ పట్నం, అమరావతి, తిరుపతిలను మూడు హట్లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం తో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. రాష్ట్ర పర్యాటక రంగానికి తాము చేస్తున్న కృషి. ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నా యన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యాటక కార్యక్రమాలు చేపట్టి పర్యాటకాభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP New Tourism Policy 2024-29 Buddhist Circuit Vizag Kandula Durgesh Assembly Speech Vizag Tourism Vizag Tourism Investments 8650 Crores

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.