విశాఖపట్నం (Visakhapatnam) కైలాసగిరి వద్ద కొత్తగా ప్రారంభమైన స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ బ్రిడ్జ్ 55 మీటర్ల పొడవు కలిగి ఉంది, సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన జర్మనీలో దిగుమతి చేసుకున్న 40ఎంఎం మందం గల ల్యామినేటెడ్ గాజుతో తయారు చేశారు. గరిష్టంగా 500 టన్నుల బరువును తట్టుకునే సామర్థ్యం ఉన్న ఈ బ్రిడ్జ్, ప్రకృతి వైపరీత్యాల సందర్భంలోనూ స్థిరంగా ఉంటుంది. భద్రత కారణంగా ఒకేసారి 40 మంది పర్యాటకులు మాత్రమే ఈ బ్రిడ్జిపైకి ఎక్కగలరు.
Read also: Delhi pollution: స్వచ్ఛమైన గాలి ‘తెర తీయలేరా?
Sky Walk Glass Bridge
రాత్రిపూట త్రివర్ణ LED లైట్‌లతో ఈ వంతెన మెరిసిపోతుంది. బ్రిడ్జి నుంచి పర్యాటకులు సముద్రం, వైజాగ్ నగరం, చుట్టుపక్కల కొండలు, లోయలను వీక్షించవచ్చు. ఇందులో ఒక ప్రత్యేక థ్రిల్ ఉంటుంది, గాలి లో తేలియాడుతున్నట్లుగా అనిపించే అనుభూతి కలుగుతుంది. భద్రతా ప్రమాణాల ప్రకారం పునరుద్ధరణలు, పరిశీలనలు పూర్తయిన తర్వాతే ప్రారంభించారు. ఈ కొత్త ఆకర్షణ భవిష్యత్తులో కైలాసగిరి వద్ద త్రిశూల్ ప్రాజెక్ట్ వంటి ఇతర పర్యాటక కేంద్రాలతో కలిసి వైజాగ్ ను అద్భుత టూరిస్ట్ హబ్‌గా మార్చే అవకాశం కలిగిస్తుంది.
బ్రిడ్జి ప్రత్యేకతలు ఇవే..
- కొత్త స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ విశాఖపట్నం కైలాసగిరిలో ప్రారంభం
- పొడవు: 55 మీటర్లు, ఎత్తు: 862 అడుగులు
- నిర్మాణ వ్యయం: ₹7 కోట్లు, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 40ఎంఎం ల్యామినేటెడ్ గాజు
- గరిష్ట సామర్థ్యం: 500 టన్నులు, భద్రత కారణంగా 40 మంది మాత్రమే
- రాత్రి సమయంలో త్రివర్ణ LED లైటింగ్
- చుట్టుపక్కల సముద్రం, కొండలు, లోయలు వీక్షణ
- ప్రకృతి వైపరీత్యాలకు నిలకడగా డిజైన్
- భద్రతా ప్రమాణాల తర్వాత మాత్రమే ప్రారంభం
- భవిష్యత్తులో త్రిశూల్ ప్రాజెక్ట్‌తో కలిపి పర్యాటక ఆకర్షణ పెరుగుతుంది
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: