हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

AP tourism news : విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్.. ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం…

Sai Kiran
AP tourism news : విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్.. ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం…

AP tourism news : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలోని ప్రముఖ పర్యాటక నిర్వాహకుల సంఘం అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) సహకారంతో విశాఖపట్నంలో ‘ADTOI నేషనల్ టూరిజం మార్ట్ 2025’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఈ జాతీయ స్థాయి కార్యక్రమం 2026 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనుంది.

ఈ మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, ADTOI ప్రతినిధులతో కలిసి అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అద్భుతమైన తీరప్రాంతం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న విశాఖ నగరం ఇలాంటి జాతీయ కార్యక్రమానికి వేదిక కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.

Read Also: Gill Injury: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కు శుభ్‌మన్ గిల్ దూరం

ఈ టూరిజం మార్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని (AP tourism news) తీర ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఎకో-టూరిజం, అడ్వెంచర్ టూరిజం, ఏజెన్సీ ప్రాంతాల పర్యాటక అవకాశాలను దేశవ్యాప్తంగా ప్రదర్శించే అవకాశం లభిస్తుందని మంత్రి తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, పర్యాటక రంగ నిపుణులు పాల్గొంటారని వివరించారు.

బీ2బీ సమావేశాలు, ప్యానెల్ చర్చల ద్వారా స్థానిక పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో వ్యాపార సంబంధాలు ఏర్పడతాయని, దీని వల్ల పర్యాటకుల రాక పెరగడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా విస్తృతమవుతాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటిడిసి ఎండీ ఆమ్రపాలి కాట, ADTOI ప్రెసిడెంట్ వేద్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870