Latest News: Visakhapatnam Port: దేశంలోనే స్వచ్ఛతలో విశాఖ పోర్టు టాప్‌ ప్లేస్

Read Time:  1 min
Visakhapatnam Port
Visakhapatnam Port
FONT SIZE
GET APP

విశాఖపట్నం పోర్టు (Visakhapatnam Port) మరోసారి తన సత్తాను చాటుకుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛత పఖ్వాడ అవార్డ్స్ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ అథారిటీ (VPA) పరిశ్రమల విభాగంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “స్వచ్ఛ భారత్” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ఈ అవార్డులు ప్రకటిస్తుంటారు. ఈ ఏడాది కూడా భారీ పోటీ మధ్య విశాఖ పోర్టు అగ్రస్థానాన్ని సాధించి అందరి ప్రశంసలు అందుకుంది.

Read Also: AP: ఈ నెల 14 నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్

విశాఖ పోర్టు స్వచ్ఛతలో దేశంలో అగ్రస్థానంలో

ముంబయి (Mumbai) లో జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పోర్టు (Visakhapatnam Port) ఛైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత పట్ల విశాఖ పోర్టు ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

Visakhapatnam Port
Visakhapatnam Port

స్వచ్ఛత మిషన్ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.ఈ స్వచ్ఛత అవార్డు.. పర్యావరణ సంరక్షణ, స్థిరమైన ఓడరేవు కార్యకలాపాల్లో.. విశాఖ పోర్టు నాయకత్వాన్ని బలోపేతం చేసిందని అంగముత్తు పేర్కొన్నారు.

ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములు, పీపీపీ నిర్వాహకులు, కార్మిక సంఘాల నాయకుల సహాయ, సహకారాలతో ఇలాంటి లక్ష్యాలు సాధిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోర్టు కార్యదర్శి టి వేణుగోపాల్, చీఫ్‌ ఇంజినీర్‌ ఎస్‌ఎస్‌ఆర్‌సీ మూర్తి, సీఎంఈ రాంప్రసాద్, సీఎంఓ డాక్టర్‌ ఎస్‌ ఉషాదేవి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.