విశాఖపట్నం (Visakhapatnam) లో అమెజాన్ తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది.పెందుర్తి వద్ద రెండేళ్ల క్రితం డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆ సంస్థ ప్రారంభించింది. వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కొత్త విస్తరణ ప్రణాళికలు, విశాఖపట్నం (Visakhapatnam) టెక్నాలజీ హబ్‌గా మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడతాయని ఆశిస్తున్నారు. అమెజాన్ విశాఖలో తన కార్యకలాపాలను గణనీయంగా పెంచాలని నిర్ణయించుకుంది.
Read Also: Rushikonda Palace : రుషికొండ ప్యాలెస్ ను స్టార్ హోటల్ గా మార్చబోతున్నారా..?
పెట్టుబడిని కూడా రెట్టింపు
ప్రస్తుతం 300 మంది ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ సంస్థ, రాబోయే మూడేళ్లలో మరో 533 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. దీని ద్వారా మొత్తం ఉద్యోగుల సంఖ్య 833కి చేరుతుంది. ఈ విస్తరణకు అవసరమైన పెట్టుబడిని కూడా రెట్టింపు చేయాలని అమెజాన్ యోచిస్తోంది.ఈ-కామర్స్ రంగంలో తమ ఎగుమతులను గణనీయంగా పెంచుకోవాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకు సాగుతోంది.
రాబోయే కాలంలో రూ.100 కోట్ల మేర ఈ-కామర్స్ ఎగుమతులను పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుందని భావిస్తున్నారు. అమెజాన్ తన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI)లో తమ సంస్థను రీ-రిజిస్టర్ చేసుకుంది. ఇప్పుడు దాన్ని విస్తరించి 850 మందిని నియమించుకోనుందని IT వర్గాలు తెలిపాయి. మూడేళ్లలో ₹9,740 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకుందని చెప్పాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: