విశాఖపట్నం(Vizag)లో జూన్ 21న జరగనున్న యోగాంధ్ర-2025 (Yogandhra-2025)వేడుకల కోసం పోలీసులు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా బీచ్ రోడ్, భీమిలి రోడ్ వంటి ప్రధాన రహదారులను ఇవాళ్టి నుంచే మూసివేశారు. ఈ నిర్ణయం నగర వాసులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా మద్దిలపాలెం, మధురవాడ, హనుమంతువాక, ఆదర్శనగర్ వంటి ప్రాంతాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
మూడురోజుల ముందే మూసివేతపై ప్రజల ఆగ్రహం
వేడుకలకు మూడురోజుల ముందే రోడ్లు మూసివేయడంపై ప్రజలు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇప్పుడే ఇలా అయితే 21న పరిస్థితి ఏంటో?” అంటూ ప్రశ్నిస్తున్నారు. అవసరమైన వ్యాపారాలు, స్కూళ్లు, హాస్పిటల్ రూట్లను కూడా బ్లాక్ చేయడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ నిలిచిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోలీసుల వ్యవస్థాపక తీరుపై విమర్శలు
పోలీసు శాఖ ముందస్తుగా రూట్ మ్యాపులు, ట్రాఫిక్ డైవర్షన్లు ప్రకటించకపోవడంతో ప్రజల్లో అవగాహన లేక గందరగోళం నెలకొంది. వేడుకలు జరగడంలో ప్రజలకు అభ్యంతరం లేకపోయినా, సాధారణ ప్రజల నిత్యజీవితాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం సరికాదని విశాఖ వాసులు అంటున్నారు. అధికారుల నుంచి క్లారిటీ లేకపోవడం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ లో లోపాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.
Read Also : BCCI : బీసీసీఐకి ఎదురుదెబ్బ