📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Visakhapatnam: ఎపి ఆర్థిక రాజధానిగా విశాఖ

Author Icon By Saritha
Updated: October 13, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి

విశాఖపట్నం : ఎపి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని, 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh)పేర్కొన్నారు. విశాఖలో (visakhapatnam) మొదటి ఎఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన అనంతరం రిషికొండలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇక్కడున్న ఐటీ ప్రొఫెషనల్స్ కు, సిఇఒలకు నాహృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. నిజాయతీగా చెప్పాలంటే.. 1990ల్లో పలు ఐటీ సంస్థలు హైదరాబాద్కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైబర్ టవర్స్ ను నిర్మించారు. దీనివల్ల అనేక సంస్థలు హైదరాబాద్కు వచ్చాయి. హైదరాబాద్ అభివృద్ధికి 30 యేళ్లు పైనే పట్టింది. విశాఖకు పదేళ్లకు మించి పట్టదు. అది మా కమిట్మెంట్, కంపెనీలు తీసుకు రావడం వెనుక ఉన్న శ్రమను ప్రజలు గుర్తించాలి. రాజు గారిని మొదటిసారిగా 2017లో కాలిఫోర్నియాలో కలిశాను. ఆ సమయంలోనే మొదలైంది ఈ ప్రయాణం. ఆయనను విశాఖ, ఎపికి తీసుకువచ్చేందుకు నాకు 8 ఏళ్ల సమయం పట్టింది. పెట్టుబడుల కోసం ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతోనే కాదు.. ఇతర దేశాలతో పోటీ పడుతున్నాం. ఈకష్టాన్ని ప్రజలు కూడా అర్ధం చేసుకున్నారు. ఎపి ఆర్ధిక రాజధానిగా విశాఖపట్నంకు ఈ పెట్టుబడులు ఒక్కరోజులో రాలేదు. మంతెన రామరాజు, ఎన్ఆర్ఐ టిడిని నేత సాగర్ దొడ్డపనేని, కాటంనేని భాస్కర్ ఈ ప్రాజెక్ట్ను విశాఖపట్నానికి తీసుకురావడంలో ఎంతో కీలకపాత్ర పోషించారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఎంతో మంది విశాఖలో మొదటి ఎఐ డేటాసెంటర్కు శంకుస్థాపన చేస్తున్న మంత్రి నారా లోకేష్ కృషి ఉంది. గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. విశాఖపట్నం ఎపికి ఆర్థిక రాజధాని.

Read also: ఒక్కసారి నాటితే ఆరుసార్లు కోతకు వచ్చే వరి రకం

ప్రధానమంత్రి మోడీ మద్దతుతో ఏపి ఆర్థిక శక్తి పెరుగుదల

ఇది మా అజెండా. ఒకే రాష్ట్రంఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. ప్రజలు ఆ విధంగానే ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. 94 శాతం సీట్లతో విజయం సాధించాం. సమర్థ పాలనకు, ఉద్యోగాల సృష్టికి, విశాఖను (visakhapatnam) ఆర్థిక రాజధానిగా చేయడానికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. విశాఖ ప్రజలు ఎప్పుడూ టిడిపితోనే ఉన్నారు. ఈ నగరంపై నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది. 2019లో రాష్ట్రంలో, ఇతర ప్రాంతాల్లో మేం ఓడిపోయినా విశాఖ ప్రజలు మాత్రం మాతోనే ఉన్నారు. విశాఖ ప్రజలు ధైర్యవంతులు. 2014 సమయంలో హుద్ హుద్ విపత్తు వచ్చినప్పుడు నగరం తీవ్రంగా నష్టపోయింది. అప్పుడు విశాఖ ప్రజలు నగర పునరుద్ధరణకు చంద్రబాబునాయుడు గారికి ఎంతో మద్దతుగా నిలిచారు. ఆసమయంలో ప్రధాని మోడీ గారు కూడా నష్టాన్ని స్వయంగాచూశారు. ఇంత విధ్వంసం తర్వాత కూడా ప్రజలు చిరునవ్వుతో చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. అది విశాఖ ప్రజల స్ఫూర్తి. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖపట్నానికే వస్తోంది. గత 17 నెలల్లో ఎపికి వచ్చిన 120 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 50 శాతం కంటే ఎక్కువగా గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్కు వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖకు వస్తోంది. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖపట్నానికే వస్తోంది. దీనివల్ల శక్తివంతమైన ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. సూపర్సిక్స్ హామీల్లో చెప్పినట్లుగా 20 లక్షల ఉద్యో గాలు కల్పించడమే మా ప్రధానలక్ష్యం. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం. ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ రైలులా దూసుకెళ్తాంది. టిసిఎస్కు 99 పైసలకే భూమి కేటాయించారని కొంతమంది నన్ను విమర్శిం చారు. కొంతమంది కోర్టుకుకూడా వెళ్లారు. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడ దలుచుకోలేదు. ఆ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. ఆ నిర్ణయం వల్ల కాగ్నిజెంట్, యాక్సెంచర్, సత్వా, గూగుల్ వంటి సంస్థలు విశాఖకు వచ్చాయి. ఒక విధాన నిర్ణయం ఎన్నో మార్పులకు కారణమైంది. విశాఖకు ఇది ఎంతో కీలక సమయం. ఏపీ ఆర్థిక అజెండాకు ప్రధాని నరేంద్ర మోడీ సహకరి స్తున్నారు. కేంద్రం చేపట్టే ఆర్థిక సంస్కరణల్లో ఎపికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

విశాఖ – ఏపి ఆర్థిక రాజధానిగా లోకేష్ సంకల్పం

విశాఖలో 3 లక్షలమంది యోగాంధ్ర నిర్వహించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ సృష్టించాం. ఇది చూసి ప్రధాని గారు ఆశ్చర్యపోయారు. ఇదీ విశాఖ ప్రజల నిబద్ధత. ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్వల్ల విశాఖ స్టీల్ ప్లాంటు కాపాడుకో గలిగాం. కేంద్రం స్టీల్ ప్లాంట్కు రూ.11వేల కోట్ల సాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు అందించింది. మూడు ఫర్నేస్లు ఇప్పుడు పని చేస్తున్నాయి. వంద శాతం సామర్థంతో నడిపి ప్లాంట్ను లాభదాయకంగా మారేలా చేస్తాం. నిధులు అడగాల్సిన అవసరం రాకూడదు. ఇదే మా లక్ష్యం. రూ.14వేల కోట్ల సాయం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించడమే కాదు.. అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. ఇది కేవలం ఎపి ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు.. భారత్ ఆర్థిక వ్యవస్థకూ దోహదం చేస్తుంది. రైల్వే జోన్ సాధించాం, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నాం. ఇప్పుడు టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ఐటీ కంపెనీలు వస్తున్నాయి. వచ్చే మూడు నెలల్లో విశాఖకు మరిన్ని పెట్టుబడులు వస్తాయి. ఏ ఒక్క పెట్టు బడి పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది తొలి అడుగు మాత్రమే. మొత్తం ఎకో సిస్టమ్ రావాల్సిన అవరసం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఫీ చైర్మన్ రాజు వేగేశ్న, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షా రామ్, రాజేష్ తిరుమల రాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యే పెన్మత్మ విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఐటీ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఎపిఐఐసి ఎండీ అభిషిక్త్ కిషోర్, ఇతర ఉన్నతాధికారులు ఎన్.యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh AP Government Investments IT development latest news Nara Lokesh Telugu News visakhapatnam Visakhapatnam Steel Plant

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.