Visakhapatnam: ఆంధ్ర యూనివర్సిటీకి బాంబు బెదిరింపు

Read Time:  1 min
Visakhapatnam
Visakhapatnam
FONT SIZE
GET APP

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఆంధ్ర యూనివర్సిటీలో (AU) బాంబు బెదిరింపు మెయిల్ ఒక్కసారిగా కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి యూనివర్సిటీ అధికారిక మెయిల్ ఐడీకి బాంబు పెట్టినట్లు సందేశం రావడంతో వర్సిటీ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఈ విషయాన్ని గమనించిన అధికారులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్రీటౌన్ పోలీసులు భారీగా యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు.

Read Also: Odisha: పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు

Visakhapatnam: Bomb threat to Andhra University
Visakhapatnam: Bomb threat to Andhra University

ఈమెయిల్ బెదిరింపుతో అప్రమత్తమైన పోలీసులు

ఈ బెదిరింపు నేపథ్యంలో పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఏయూ పరిధిలో అణువణువూ తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయం, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మరియు విద్యార్థుల హాస్టల్ పరిసరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అనే కోణంలో మెటల్ డిటెక్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు మరియు సిబ్బంది భయాందోళనలకు గురికాకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని సీఐ పైడయ్య మీడియాకు తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది? దీని వెనుక ఉన్న దుండగులు ఎవరు? అనే విషయాలను చేధించడానికి సైబర్ క్రైమ్(Cyber crime) విభాగం కూడా రంగంలోకి దిగింది. నిందితులను త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.