విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..
విజయవాడ : శ్రీకాకుళం(Srikakulam) నుంచి కోనసీమ వరకూ ఉన్న విశాఖ ఆర్ధిక
ప్రాంత అభివృద్ధికి (CM Chandrababu)యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అవసరమైన పాలసీలను రూపొందించాలని సూచనలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ కే.విజయానంద్, ఆర్ధిక, పెట్టుబడులు, మోలిక సదుపాయాల కల్పన, పర్యాటక, ఐటీ, మున్సిపల్, పరిశ్రమలు, వ్యవసాయ, ప్రణాళికా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీఈఆర్ ప్రాంతం రాష్ట్రానికి గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై ముఖ్యమంత్రి వివిధ శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Read also: పెరగనున్న చలి..ఈరోజు నుంచి జాగ్రత్త!
విశాఖ ఆర్థిక ప్రాంత అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
శ్రీకాకుళం(CM Chandrababu) నుంచి కోనసీమ వరకూ ఉన్న వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్ గా అభివృద్ధి చేసే విషయంలో స్థానికంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, ప్రజల జీవన ప్రమాణాలు, సుస్థిరాభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనికి సంబంధించిన ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం స్పష్టం చేశారు. మొత్తం ఏడు అంశాల ఆధారంగా వీఈఆర్ గ్లోబల్ ఎకనామిక్ హబ్ గా మారుతుందని సీఎం వ్యాఖ్యానించారు. పోర్టుల ద్వారా కార్గో హ్యాండ్లింగ్ తో పెద్ద ఎత్తున లావాదేవీలు జరగాల్సి ఉందని అన్నారు. శ్రీకాకుళం మూలపేట పోర్టు నుంచి రీజియన్ లోని కాకినాడ పోర్టు వరకూ హింటర్ ల్యాండ్ లోని చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్ లాంటి ప్రాంతాలకు చెందిన కార్గోను కూడా రవాణా జరిగేలా చూడాలని సూచించారు.
మూలపేట పోర్టు నుంచి దుగరాజపట్నం పోర్టు వరకూ షిప్ బిల్డింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యేలా చర్యలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తర దక్షి ణాది రాష్ట్రాలను కలుపుతున్న ఏపీ ఇక ఈస్ట్ వెస్ట్ కారిడార్ గానూ మారాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 1215 మాన్యుఫాక్చరింగ్ నోడ్స్ కలిగిన ప్రాంతంగా విశాఖ ఎకనామిక్ రీజియన్ మారుతుందని అన్నారు. ప్రత్యేకించి ఈ రీజియన్ లో క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. విశాఖ లాంటి ప్రాంతాలు నెక్స్ జెన్ ఐటీ డేటా సెంటర్, ఏఐ ఇన్నోవేషన్ మారుతున్నాయన్నారు. ఈ రీజియన్ లోని ఇతర ప్రాంతాలు జాతీయ, అంతర్జాతీయ హెల్త్ కేర్ హబ్ గా మార్చాల్సి ఉందన్నారు. అలాగే ప్రణాళికా బద్దంగా పట్టణీకరణ హౌసింగ్ ప్రాజెక్టులు రావాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో స్లమ్ క్లస్టర్ రీడెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: