📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Visakha: ఉక్కు కార్మికులపై చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరం: షర్మిల

Author Icon By Saritha
Updated: November 19, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : విశాఖ ఉక్కు(Visakha) కార్మికులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకం మని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ” ఎక్స్’న వేదికగా చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సిఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, ఉక్కు పరిశ్రమ కార్మికులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.. కార్మికులకు పెండింగ్ జీతాలు ఇప్పించాలని, ప్రైవేటీకరణ లేదని ప్రధానితో బహిరంగ ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఎంత ఉత్పత్తికి అంతే వేతనం అంటూ అధికారులు సర్క్యులర్ జారీ చేయడాన్ని షర్మిల తప్పుబట్టారు. 30 వేల మంది కార్మికులను 18 వేలకు కుదించారని, ఉక్కు ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకు తగ్గించారని, 45 రోజుల పాటు సరిపాడా నిల్వ ఉండాల్సిన ముడి సరుకును కేవలం 5 రోజులకు మించి నిల్వలు పెట్టడం లేదన్నారు. ఐరన్ ఓర్ అందక నెలకు వారం రోజులు ఉత్పత్తి తెలిపారు. ఆవుతున్నారని తప్పులన్నీ యాజమాన్యం దగ్గర పెట్టుకుని కార్మికులపై నిందలు మోపడం సరికాదన్నారు. విశాఖ కార్మికులకు సీఎం చంద్రబాబు తీరని అన్యా యం చేయాలనుకుంటున్నారన్నారు. ఆయన స్టీల్స్ మాటలకు విశాఖ స్టీల్స్ జరుగుతున్న దానికి భిన్నమైన పరిస్థితులున్నాయన్నారు.. సీఎం విశాఖ ప్రైవేటీకరణ జరగదంటారు. కేంద్రం మరో విధంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ నిరక్ష ఓం దూది రైతుకు దుఃఖం తెచ్చి పెట్టింది.

Read also: యువతపై ఉపాసన, శ్రీధర్ వెంబు భిన్న వాదనలు

Chandrababu’s comments on steel workers are objectionable: Sharmila

రైతుల సమస్యలపై షర్మిల వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం(Visakha) మక్క రైతుల రెక్కలు విరుస్తుందని షర్మిల ఎక్స్ వేదికలోనే మరో పోస్టింగ్లో ఆరోపించారు. మద్దతు ధర లేక రాష్ట్రంలో పత్తి రైతు చిత్తు అవుతుంటే, మొక్కజొన్న రైతు విలవిలలాడుతున్నాడు అన్నారు. మోంతా తుఫాను ధాటికి దిగుబడి తగ్గి రైతు దిగాలు పడుతుంటే.. చేతికొచ్చిన అరకొర పంటకైనా గిట్టుబాటు ధర పెట్టకుండా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది అన్నారు. పొలం మీదే వంటలకు రైతులు నిప్పు పెడుతుంటే రైతు సుభిక్షం లాంటి మాటలు చంద్రబాబు గారు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. క్వింటా పత్తికి కనీస మద్దతు ధర రూ.8110 ఉంటే మార్కెట్ లో గరిష్టంగా రూ.7వేలు పెట్టడం లేదు అన్నారు. వర్షాలకు రంగు మారిందని, తేమ ఉందని, పురుగు సోకిందని కొర్రీలు పెట్టడం దుర్మార్గం అన్నారు. ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టీ పత్తి పండిస్తే క్వింటాలు కూడా దిగుబడి రాలేదని అన్నారు మార్కెట్ ధరతో పోల్చితే ఇంకా రూ. 10 వేలు నష్టమేనన్న రైతుల బాధలు వర్ణనాతీతం అన్నారు. మొక్కజొన్నలకు కనీస మద్దతు ధర రూ. 2400 ఉండగా మార్కెట్ లో ధర రూ. 1400 కూడా ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు. తుఫాను ప్రభావంతో ఎకరాకు దిగుబడి 10 క్వింటాలకు తగ్గితే, రూ.35వేలు పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడి రూ.20వేల కన్నా ఎక్కువ లేకపోవడం ఆందోళనకరం అన్నారు. పత్తి, మొక్కజొన్నే కాదు.. చంద్రబాబు గారి ఏడాదిన్నర పాలనలో ఏ పంటకు మద్దతు ధర లేదు అన్నారు. మిరపకు రూ.12 వేలు మద్దతు ధర ఉంటే రైతుకి దక్కింది రూ.6వేలే అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

agriculture CM-Chandrababu Cotton-Farmers Pending-Salaries privatization Steel-Workers visakhapatnam Worker-Rights YS-Sharmila

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.