📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Viral news: కలకలం రేపుతున్న చంద్రబాబు ఫేక్ వీడియో కాల్స్

Author Icon By Saritha
Updated: October 10, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చంద్రబాబు పేరుతో వీడియో కాల్‌ మోసం

ఏఐ టెక్నాలజీ వలన ఏది నిజమో, ఏది కృత్రిమమో గుర్తు పట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో కొంతమంది మోసగాళ్లు కొత్త పద్ధతిలో మోసాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్లను ఉపయోగించి టీడీపీ నేతలను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. ఏఐ సాయంతో చంద్రబాబు, ఉమాలా వీడియో కాల్స్(viral news) రూపొందించి, టీడీపీ నాయకులను మభ్యపెట్టారు.

గత నెల 30న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కొంతమంది టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని ఒక తెలియని వ్యక్తి కాల్‌ చేశాడు. దేవినేని ఉమా పీఏనని చెప్పి, “సార్ వీడియో కాల్ చేస్తారు” అని చెప్పాడు. కొంతసేపటికి ఉమాలాగా కనిపించే వ్యక్తి వీడియో కాల్ చేసి, తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువు కోసం సాయం చేయాలని చెప్పి, మూడు ఫోన్ నంబర్లు ఇచ్చాడు. ఆ నంబర్లకు ఫోన్‌పే ద్వారా డబ్బు పంపాలని చెప్పడంతో నాయకులు నమ్మి రూ.35 వేల రూపాయలు పంపారు.

 Read also: ట్రంప్ జనరిక్ మందులపై సుంకాలను తాత్కాలికంగా నిలిపివేసారు

చంద్రబాబు పేరుతో కొత్తగా మోసపూరిత ప్రణాళిక

తర్వాత ఈ నెల 7న అదే వ్యక్తి మళ్లీ వీడియో కాల్‌(viral news) చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి బీ-ఫామ్‌ ఇస్తానని చెప్పాడు. “చంద్రబాబు(Chandrababu)గారు మీతో మాట్లాడుతారు” అంటూ మరో వీడియో కాల్‌లో చంద్రబాబు లాగా ఉన్న వ్యక్తిని చూపించాడు. అతను కూడా పోటీ చేయాలనుకునే వారి పేర్లు సేకరించాలని సూచించాడు.

ఇక, విజయవాడకు రావాలని, ఒక హోటల్‌లో బస చేయాలని తెలిపాడు. హోటల్‌ నిర్వాహకులకు కూడా “నాయకులు వస్తున్నారు, ఖర్చు నేను చెల్లిస్తాను” అని చెప్పడంతో వారికి కూడా అనుమానం రాలేదు. సత్తుపల్లిలోని 18 మంది టీడీపీ నాయకులు విజయవాడ చేరి ఆ హోటల్‌లో దిగారు. తర్వాత వీడియో కాల్‌లో ఆ వ్యక్తి “సీఎంను కలవాలంటే ఒక్కొక్కరు రూ.10 వేలుగా ఇవ్వాలి” అని చెప్పడంతో నాయకులకు అనుమానం వచ్చింది.

ఆ సమయంలో హోటల్‌ బిల్లు చెల్లించమని సిబ్బంది డిమాండ్ చేయడంతో వాదన జరిగింది. పోలీసులు విచారణలోకి దిగగా దేవినేని ఉమాను సంప్రదించారు. ఆయన స్పందిస్తూ “నేను ఎవరికీ వీడియో కాల్ చేయలేదు, ఏలూరు జిల్లా భరగవ్ అనే వ్యక్తి పేరుతో ఈ మోసాలు జరుగుతున్నాయి, పోలీసులకు ఫిర్యాదు చేశాను” అని తెలిపారు. అసలు విషయం తెలిసిన ఖమ్మం టీడీపీ నేతలు ఇబ్బందికి గురై, ఫిర్యాదు చేయకుండా వెనుదిరిగినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

AI Scam Chandrababu Naidu devineni uma son marriage latest news TDP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.