📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News telugu: Viral fevers: వ్యాపిస్తున్న విషజ్వరాలు..వణికిపోతున్న గ్రామాలు

Author Icon By Sharanya
Updated: September 10, 2025 • 2:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: ఏపీలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జనం జ్వరంతో వణుకుతు న్నారు,. తరుణ వ్యాధులైన డెంగీ, మలేరియాతో పాటు చికూన్ గున్యా.టైపాయిడ్ లక్షణాలతో కూడిన విషజ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి. ఈ విషజ్వరాలు శోకిన వారిలో రాత్రి సమయాల్లో అత్యధిక టెంబరేచర్, జలుబు, తలనొప్పితో ఇబ్బందివడుతున్నారు. క్రమంగా అరికాళ్ళలో, మోకాళ్ళల్లో నొప్పు లు వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. శ్వాస సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు. ప్రకాశం, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో విషజ్వరాలు అధికంగా ఉన్నాయి. దాదాపు ప్రతి జిల్లాల్లో ఆస్పత్రుల్లో రోగులు (Patients in hospitals)కిటకిటలాడుతున్నాయి. రోగులు ప్రభుత్వ, ప్రైవేటటు ఆస్పత్రులకు క్యూలు కడుతున్నారు. ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.

News telugu

వర్షాకాలంలో వైరల్ జ్వరాలు అధికంగా నమోదు

వర్షాకాలంలో వైరల్ జ్వరాలు సాధారణమే అయినప్పటికీ ఈసారి కాస్త ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాల కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విజయవాడ (Vijayawada)నగరంలోని పటమట, కృష్ణలంక, హౌసింగ్బోర్డ్్కలనీ, మాచవరం, గుణదల, సింగ్నగర్, జక్కంపూడి కాలనీల్లో వైరల్ జ్వరాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులు, ప్రధానంగా ఓపెన్ డ్రైనేజీలు అధికంగా ఉండడం, దోమల వ్యాప్తి పెరగడంతో విషజ్వరాలను అదుపు చేయడం కష్టంగా మారుతోంది. విజయవాడ నగరంలో వెయ్యికి పైగా ప్రాంతాలను ప్రమాదకరమైనవిగా గతంలోనే గుర్తించారు. చాలా కాలనీల్లో చెత్తను వీధుల్లో విచ్చలవిడిగా పడేస్తున్నారు. ఇవే దోమలకు ఆవాస కేంద్రాలుగా మారుతున్నాయి. నగరంలో 27 కిలోమీటర్ల పరిధిలో ఏలూరు, బందర్, రైవస్ కాలువలు, 15 కిలోమీటర్ల మేర బుడమేరు ప్రవహిస్తోంది. వీటిలో చెత్తా చెదారం వేయడం దోమల వ్యాప్తికి దారితీస్తోంది. ఒకట్రెండు రోజులైనా జ్వరం తగ్గనివారు, వైద్యులను సంప్రదిస్తున్నారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో పైప్లెన్ లీకేజీలతో తాగునీరు కలుషితమవుతోంది. దీనివల్ల కూడా జ్వరాలు పంజా విసురుతున్నాయి. జీజీహెచ్లో రోజూ 40 నుంచి 50 ఓపీ కేసులు వైరల్ జ్వరాలవే నమోదువుతున్నాయి. సగటున రోజుకు 28 ఇన్ పేషెంట్లను చేర్చుకుంటున్నారు. వర్షాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

డెంగీతో ప్రాణాపాయం ముప్పు ఎక్కువ

ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. డెంగీ బారినపడితే ప్రాణాపాయం ముప్పు ఎక్కువ ఉంటుంది. ముందుగానే గుర్తించి అప్రమత్తమవ్వకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ప్రధానంగా ప్లేట్లెట్స్ పడిపోవడం, శరీర వ్యాధి నిరోధక వ్యవస్థపై దాడి చేయడం జరుగుతుంది. డెంగీకి కారణమయ్యే దోమలు మంచినీటిలో పెరుగుతాయి. ప్రధానంగా వర్షం పడినప్పుడు ఇళ్లకు చుట్టుపక్కల ఉండే ఖాళీ పాత్రలు, కుండీల్లో నీరు చేరి వాటిలో డెంగీ దోమలు పెరుగుతుంటాయి. మురికి కాల్వల దగర ఇవి తక్కువ ఉంటాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వారాల తరబడి చికిత్స కోసం చేరి ఆర్థికంగా, శారీరకంగా ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి. విజయవాడలో ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రులను బాధితులు ఆశ్రయిస్తుండగా పెద్దసంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రులకు సైతం వస్తున్నారు. ప్రజలు వర్షాకాలం వేళ తగిన జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాలు రాకుండా అదుపు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు కాచి వడబోసిన నీటిని తాగడం మంచిదని సూచిస్తున్నారు. ఇక ఇంతగా విషజ్వరాలు ప్రబలుతుంటే ఆరోగ్యశాఖ తగిన రీతిలో స్పందించడం లేదనే అభియోగాలున్నాయి. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లులు ఫీవర్ సర్వేలు చేయడం లేదు,పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన మందులు లేవు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/lokesh-tries-to-bring-back-ap-residents-stranded-in-nepal-to-india/andhra-pradesh/544447/

Andhra Pradesh Fevers Breaking News Gramalu Fever Cases Health Alert latest news Seasonal Fevers Telugu News Viral Fevers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.