ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వింజమూరు(Vinjamoore) మండలంలో ఎంపీపీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును అడ్డగించి, టీడీపీ నేతలు వారిని బలవంతంగా తీసుకెళ్లారని సమాచారం వెలువడింది.
Read also: AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ పైప్ లీక్
ఈ ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే కాకర్లకు సంబంధించిన వర్గీయులు దాడికి పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంపీటీసీలు మల్లికార్జున్, రత్నమ్మ, మోహన్ రెడ్డిలను నిర్బంధించి, శారీరకంగా వేధించారంటూ పార్టీ నేతలు మండిపడ్డారు.
ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను(Vinjamoore) అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని వైసీపీ అభిప్రాయపడుతోంది. ఘటనపై పోలీసులు సమాచారం సేకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: