Vinjamoore: ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీటీసీల కిడ్నాప్!

Read Time:  1 min
Vinjamoore
Vinjamoore
FONT SIZE
GET APP
Current image: Vinjamoore

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వింజమూరు(Vinjamoore) మండలంలో ఎంపీపీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును అడ్డగించి, టీడీపీ నేతలు వారిని బలవంతంగా తీసుకెళ్లారని సమాచారం వెలువడింది.

Read also: AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ పైప్ లీక్

Vinjamoore

ఈ ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే కాకర్లకు సంబంధించిన వర్గీయులు దాడికి పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంపీటీసీలు మల్లికార్జున్, రత్నమ్మ, మోహన్ రెడ్డిలను నిర్బంధించి, శారీరకంగా వేధించారంటూ పార్టీ నేతలు మండిపడ్డారు.

ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను(Vinjamoore) అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని వైసీపీ అభిప్రాయపడుతోంది. ఘటనపై పోలీసులు సమాచారం సేకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.