📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Vijayawada: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కఠిన పోలీస్ ఆంక్షలు

Author Icon By Pooja
Updated: December 29, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొత్త సంవత్సరాన్ని స్వాగతించే సందర్భంలో విజయవాడ(Vijayawada) నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి జరగనున్న వేడుకల నేపథ్యంలో నగరంలోని బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు అన్ని ఫ్లైఓవర్లను రాత్రి సమయంలో మూసివేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు జనవరి 13 వరకు రాత్రి వేళల్లో అమలులో ఉంటాయని తెలిపారు.

Read Also: AP: పెరిగిన మద్యం అమ్మకాలు.. కొత్త పాలసీతో ప్రభుత్వానికి ఆదాయం

Vijayawada: Strict police restrictions in view of New Year celebrations.

రోడ్లపై వేడుకలకు నిషేధం

నూతన సంవత్సర వేడుకల (Vijayawada)పేరిట రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, గుంపులుగా చేరి హడావుడి చేయడం పూర్తిగా నిషేధమని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజా ప్రదేశాల్లో ఇలాంటి చర్యలకు అనుమతి ఉండదన్నారు.

యువత అతివేగంగా వాహనాలు నడపడం, బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, సైలెన్సర్లు తొలగించి శబ్ద కాలుష్యం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

ట్రిపుల్ రైడింగ్ సహా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అందరూ పోలీసులకు సహకరించి కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, భద్రంగా తమ ఇళ్ల వద్దే జరుపుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు ప్రజలను కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu New Year Restrictions Traffic Curbs Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.