📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest News: Vijayawada Rains: విజయవాడలో కుండపోత వర్షాలు

Author Icon By Radha
Updated: October 9, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మరో రెండు రోజులు తప్పని తిప్పలు

విజయవాడ: వర్షం ఏపీని వదిలిపెట్టేటట్లు లేదు. బుధవారం రాత్రి విజయవాడ(Vijayawada Rains) నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో రహదారులన్నీ జలమయ్యమయ్యాయి. ప్రధాన రహదారులైన బందరు రోడ్డు(Bandar Road), పాలీక్లినిక్ రోడ్డుతో పాటు వన్ టౌన్లో ప్రాంతంలో రహదారులపై నీరు నిలవటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు కాలనీల్లో డ్రైనేజీ, కాలువలు పొంగిపొర్లాయి. ప్రధాన రహదారులపై నిలిచిన ట్రాఫిక్ను సరిదిద్దడానికి పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ మన్నార్ వరకు తెలంగాణ, రాయలసీమ, అంతర్ తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.

Read also: Revenue: రైల్వే ఆదాయం అదుర్స్

లోతట్టు ప్రాంతాల ఆందోళన

Vijayawada Rains: గురువారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి, నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో మధురవాడ మార్కెట్ జలమయం అయ్యింది. మార్కెట్ అంతా నీరు చేరడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు అవస్థలు పడ్డారు. కుండపోతగా కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లపై వెళ్లే వాహనదారులు వర్షానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చిన్న చినుకు పడినా మధురవాడలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రెండు మూడు రోజులు వర్షపు నీరు నిలిచిపోవడం పరిపాటిగా మారింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి వీలైనంత త్వరగా వర్షపు నీటిని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

విజయవాడలో వర్షం ఎప్పుడు కురిసింది?
బుధవారం రాత్రి విజయవాడ నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.

వర్షంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?
ప్రధాన రహదారులు జలమయ్యాయి, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది, డ్రైనేజీలు పొంగిపోయాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh News AP News Heavy Rains latest news rain alert Rain update Vijayawada Vijayawada Rains Weather Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.