విజయవాడ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే 11 ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ళు కాకినాడ టౌన్, వికారాబాద్, పార్వతీపురం, సికింద్రాబాద్ మధ్య జనవరి 7 నుంచి 12,2026 మధ్య వివిధ తేదీల్లో నడుస్తాయి. కొన్ని రైళ్ళు సాయంత్రం లేదా రాత్రి బయలుదేరి మరుసటి రోజు గమ్యస్థానానికి చేరుకుంటాయి.
Read also: Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై ఆగ్రహం.. అతని దిష్టి బొమ్మ దగ్ధం
Vijayawada Railway
ఈ రైళ్ళలో ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. కొన్ని రైళ్ళకు టికెట్ బుక్కింగ్ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్ళే వారికి ఈ ప్రత్యేక రైళ్ళు చాలా ఉపయోగంగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణానికి ముందు రైలు సమయాలు చూసుకొని టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: