📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Chandrababu Naidu : విజయవాడ లోక్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ ఎవరు వచ్చారు?

Author Icon By Sai Kiran
Updated: January 26, 2026 • 6:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Chandrababu Naidu : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సాంప్రదాయ తేనీటి విందుకు ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, మంత్రి Nara Lokesh హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కార్యక్రమానికి వచ్చిన అతిథులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు ఆత్మీయంగా స్వాగతించారు. పోలీస్ బ్యాండ్ జాతీయ గీతాన్ని ఆలపించడంతో వేడుక ప్రారంభమైంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also:Telangana: ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి

chandrababu naidu

అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి (Chandrababu Naidu) వేదికపై నుంచి కిందకు వచ్చి ఇతర అతిథులతో కలిసిపోయారు. స్వాతంత్య్ర సమరయోధులతో ముచ్చటిస్తూ వారి అనుభవాలను తెలుసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పద్మ పురస్కార గ్రహీతలు, కళాకారులు, క్రీడాకారులతో నేతలు ఆత్మీయంగా పలకరించడంతో లోక్ భవన్ ప్రాంగణమంతా ఆహ్లాదకర వాతావరణంతో నిండిపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Governor At Home AP Republic Day celebrations At Home ceremony Andhra Pradesh Breaking News in Telugu Chandrababu Naidu Google News in Telugu Latest News in Telugu Lok Bhavan Vijayawada Nara Lokesh Pawan Kalyan Republic Day 77 Andhra Pradesh Republic Day At Home AP Telugu News Vijayawada political event

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.