ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గామల్లేశ్వర(Vijayawada) స్వామివార్ల దేవస్థానంకు వచ్చే దారి కనకదుర్గా నగర్ లో వున్న టోల్ వసూలు కాంట్రాక్టర్ పై ఇఓ వికె శీనా నాయక్ కొరడా ఝళిపించారు. ఇటీవల టోల్ వసూల్ కాంట్రాక్టర్ పై వచ్చిన పలు ఆరోపణల మేరకు ఇఓ కూలంకుశంగా పరిశీలన చేసి ఈ చర్యలు తీసుకున్నారు. టోల్ కాంట్రాక్టు పొందిన పివిఎల్ దేవి కి చెందిన విఎల్డీ ఎజెన్సీ వారు టెండర్ పాడుకున్న స్థలం కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి టోల్ వసూలు చేస్తున్నట్లు పలు కథనాలపై ఇఓ చర్యలు చేపట్టారు. గతంలో వారు దేవస్థానానికి(temple) బకాయి పడ్డ 6. 1,11,98,199 లు చెల్లించాలని పలుమార్లు ఆదేశాలిచ్చినప్పటికి చెల్లించలేదని, ప్రస్తుతం విధించిన రు.50వేలు, దేవస్థానానికి బకాయి పడ్డ రు.1,11,98,199 లు నోటీసు అందిన మూడు రోజుల్లో చెల్లించని పక్షంలో నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read also: పురపాలిక చట్టాన్ని సవరించాలి
నూతన పూజామండపంలో ఎసిల తరలింపు
ఇటీవల ప్రారంభించిన(Vijayawada) నూతన పూజా మండపంలోకి ఎసిలను సోమవారం మార్పు చేశారు. ఇకపై లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చన, అన్నప్రాసన వంటి సేవలు నూతన పూజా మందిరంలో అందుబాటులో వుంటాయని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు. వేదాశీర్వచన కార్యక్రమాన్ని నిష్క్రమణ మార్గం వద్ద ఇఓ నేతృత్వంలో సోమవారం ఏర్పాటు చేశారు. వారం రోజులు ప్రయోగాత్మ కంగా కొనసాగించి అనంతరం దీనిపై తుదినిర్ణయం తీసుకుంటామని ఇఓ తెలిపారు. దుర్గమ్మవారిని సినీ నటుడు నరేష్ దర్శించుకున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: