📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vijayawada: తోతాపురి మామిడి రైతుకు భారీ ఊరట

Author Icon By Anusha
Updated: July 23, 2025 • 10:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్వింటా మామిడికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర రూ. 1490

విజయవాడ : తోతాపురి మామిడి రైతులకు ఉపశమనం లభించింది. క్వింటా మామిడికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరను రూ.1490గా నిర్ణయిస్తూ కేంద్రం నుంచి ప్రకటన వెలువడింది. 50-50 నిష్పత్తిలో కేంద్రం, ఎపి ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ (Market intervention) ధరను చెల్లించనున్నాయి. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. 2025-26 సంవత్సరానికి ఎంఐసికింద ధరల లోపం చెల్లింపు (పిడిపి)ను కేంద్రం ఆమోదించించింది. కేంద్రం నిర్ణయంతో ఎపిలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలుకు అవకాశం లభించినట్టైంది. మామిడి రైతులకు క్వింటాలు రూ.1,490.73లు చెల్లించనున్నారు. కేంద్రం, ఎపి ప్రభుత్వం సగం, సగం నిష్పత్తిలో ఈ మద్దతు ధర చెల్లించనున్నాయి.

Vijayawada: తోతాపురి మామిడి రైతుకు భారీ ఊరట

ధరల పతనాల నుండి రైతులను

కేంద్రం నిర్ణయంతో తోతాపురి రైతుకు భారీ ఊరట లభించే,అవకాశం ఉంది. రైతులకు లాభాలు భారీగా లభించకున్న పెట్టుబడి చేతికి వస్తుందంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు (Shivraj Singh Chouhan) కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ చర్య ధరల పతనాల నుండి రైతులను కాపాడటానికి అవకాశం లభించిందన్నారు. ఈ చర్య న్యాయమైన రాబడిని నిర్ధారిచండంతో పాటూ గ్రామీణ జీవనోపాధి (Rural livelihood) ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్కు రైతులు కృతఙ్ఞతలు తెలిపారు.

తోతాపురి మామిడి అంటే ఏమిటి?

తోతాపురి మామిడి ఒక ప్రసిద్ధమైన మామిడి రకం. దీని గింజ సన్నగా, ఫలం పొడవుగా ఉండి, ముందు భాగం కొంచెం ఉండటమే ప్రత్యేకత. ఇది సహజంగానే కొంచెం పులుపుగా ఉంటుంది.

తోతాపురి మామిడి ఎక్కడ ఎక్కువగా సాగు చేస్తారు?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ముఖ్యంగా సాగు చేస్తారు. కడప, చిత్తూరు జిల్లాల్లో ఈ మామిడి ఎక్కువగా కనిపిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Nandyal : నంద్యాల జిల్లాలో పొలానికి వెళ్లిన యువకుడిపై పెద్దపులి దాడి

Andhra Pradesh farmers AP Government Breaking News central government announcement latest news mango farmers support market intervention price Telugu News Totapuri mango Vijayawada news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.