విజయవాడ : రాష్ట్ర సచివాలయం లోని సాధారణ పరిపాలనా శాఖ నుంచి నలుగురు వ్యవసాయ, పశుసంవర్ధక, సహకార, ఇతర శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న మరో ఆరుగురు అధికారులను డిప్యుటేషన్ పై పురపాలక సంఘాల కమీషనర్లుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మరో వైపు వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల బదిల్లీలో భాగంగా పురపాలక శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది కమీషనర్లకు బదిలీ, పోస్టింగ్లు ఇచ్చారు. డిప్యుటేషన్ నియామకాలు. సాధారణ/పరిపాలన శాఖ సెక్షన్ ఆఫీసర్ షేక్ నజీర్ ను తాడిగడప పురపాలక కమీషనర్గా నియమించారు. అక్కడి కమీషనర్ పి. భవానీ ప్రసాద్ను రాష్ట్ర పురపాలక శాఖ కమీషన్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పారు. మరో సెక్షన్ ఆఫీసర్ కోన శ్రీనివాసను కాకినాడ నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న ఉపకమీషనర్ పోస్ట్లో నియమించారు.
ఆముదాలవలస పురపాలక సంఘ కమిషనర్ గా రవి
జీఏడీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ టి.రవిని ఆముదాలవలస పురపాలక సంఘ కమిషనర్ గా నియమించారు. అక్కడి కమీషనర్ పి.బాలాజీ ప్రసాద్ ఉద్యోగ విరమణ చేయడంతో స్థానం ఖాళీ
అయ్యింది. జీఎడీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జి. వెంకటేశ్వర్లును దాచేపల్లి నగర పంచాయితీ కమీషనర్ నియమించారు. వర్క్స్, ఎకౌంట్స్ డైరెక్టర్ కార్యాలయంలో స్పెషల్ గ్రేడ్-1 డీఏవో సి. రవిచంద్రారెడ్డిని ప్రొద్దుటూరు పురపాలక సంఘ కమీషనర్ నియమించారు. అక్కడి కమీషనర్ మల్లికార్జునను హిందూపురం పురపాలక సంఘానికి బదిలీ చేశారు. కేంద్ర నియంత్రణ జనరల్
ఎకౌంట్స్ ఆఫీసర్ వి. నిర్మల కుమార్ను ఖాళీగా ఉన్న అమలాపురం కమీషనర్ గా నియమించారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు కె. చక్రవర్తిని మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) లో అనకాపల్లి జోనల్ కమీషనర్ గా నియమించారు. జిల్లా కో-ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ బి. సన్యాసి నాయుడ్ని జీవీఎంసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ నియమించారు. యువజన, పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ అసిస్టెం ట్ సెక్షన్ ఆఫీసర్ పి.కృష్ణమోహనరెడ్డిని కదిరి పురపాలక కమీషనర్గా నియమించారు. అక్కడి కమీషనర్ డేనియల్ జోసెఫ్ పురపాలక శాఖ కమీషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయనున్నారు.
పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎస్. జయరాంను సాలూరు పురపాలక కమీషనర్ నియమించారు. అక్కడి కమీషనర్ తులసీ వెంకటకృష్ణను జగ్గయ్యపేటకు బదిలీ చేశారు.