గంజాయి విక్రయ,రవాణాదారులు పట్టుబడితే యేడాది జైలు
విజయవాడ: విజయవాడ నగర కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల రవాణా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయదారులు పట్టుబడితే కనీసం ఏడాదిపాటు జైలుకు పరిమితమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి, డ్రగ్స్ రవాణా చేస్తూ ఎక్కువ సార్లు పట్టుబడిన వారిని గుర్తించి పిట్ ఎన్డీపీఎస్ (ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్, 1988) ప్రయోగిస్తున్నారు. ఎన్టీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసినా కొన్నాళ్లకే బయటకు వచ్చి మళ్లీ బరితెగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిట్ ఎన్డీపీఎస్ అస్త్రాన్ని తెచ్చారు. మంగళవారం నలుగురు గంజాయి విక్రేతలను డిటెయిన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికీ 11 మందిని ఈ చట్టం కింద నిర్బంధించారు.
ఏడాదిపాటు జైలులోనే:
గంజాయి సాగు(Marijuana), మాదకద్రవ్యాల తయారీ, నిల్వ, క్రయవిక్రయాలు, రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే వారి కట్టడికి ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. వీటిలో ప్రమేయం ఉన్న వారిని గుర్తించి విచారణ, శిక్షలతో సంబంధం లేకుండా ముందే నిర్బంధిస్తే వారిని కట్టడి చేయొచ్చనేది భావన అయితే ఉంది. ఈ మేరకు చట్టాన్ని ప్రయోగిస్తూ నిందితులను అదుపులోకి తీసుకుని ఏడాదిపాటు జైలులో ఉంచుతున్నారు. తాజాగా ఇప్పటికే దీని కింద నిర్బంధించిన ఐదుగురితో పాటు మరికొందరిని గుర్తించారు. వారందరి జాబితా సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించి, పిట్ ఎన్డీపీఎస్ చట్టాన్ని అమలు చేయనున్నారు. మరో రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి చెందిన వ్యక్తి జీవన్ (22)పై గంజాయి కేసులు ఉన్నాయి. మాచవరం, విస్సన్నపేట ఠాణాల పరిధిలో, ఖమ్మం జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా గంజాయి తీసుకెళ్లూ దొరకగా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ విచారణలోనే ఉన్నాయి. ఇవేకాక పోక్సో, చోరీ కేసులు అదనంగా నమోదయ్యాయి. కాకినాడ (Kakinada) జిల్లా ఏలేశ్వరం వాసి కట్టా శ్రీనుపై రెండు ఎన్డీపీఎస్ కేసులు నమోదు అయ్యాయి. 2016లో రాజమహేంద్రవరంలో 3 కిలోల గంజాయి తరలిస్తూ దొరికాడు. 2017లో రంగారెడ్డి జిల్లాలో 70 కిలోలు తీసుకెళ్తూ దొరికాడు. హయత్నగర్ ఠాణాలో కేసు నమోదవగా దీని నుంచి విముక్తుడయ్యాడు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం, సింగనగర్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఇవేకాక సింగ్నగర్ స్టేషన్లో ద్విచక్ర వాహనాల చోరీ కేసులు మూడు ఉన్నాయి. జక్కంపూడి వైఎస్సార్ కాలనీవాసి పెంటుపోని దుర్గాప్రసాద్పై అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్టేషన్లో ఒకటి, విజయవాడ రెండో పట్టణ స్టేషన్లో రెండు గంజాయి కేసులు నమోదయ్యాయి.
విజయవాడ నగర కమిషనరేట్ ఏ మత్తు పదార్థాల రవాణాపై దృష్టి పెట్టింది?
విజయవాడ నగర కమిషనరేట్, గంజాయి, హెరోయిన్, బుడ్ది మందు (LSD), మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా విద్యార్థులు మరియు యువత దీనికి బలవుతుండటం పోలీసుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ చర్యలు ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నాయి?
ఈ చర్యలు ముఖ్యంగా డ్రగ్ సరఫరాదారులు, మత్తుపదార్థాలు వినియోగించే నెట్వర్క్‌లు, కాలేజీ పరిసరాల్లో అనుమానితులపై కేంద్రీకరించబడ్డాయి. యువతను మత్తు వ్యసనం నుండి రక్షించడమే ముఖ్య ఉద్దేశ్యం.
Read hindi news:hindi.vaartha.com
Read Also: