Vijayawada Crime: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో అత్యంత దారుణమైన మరియు మనసును కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. అక్షరాలు దిద్దించాల్సిన ఒక ఉపాధ్యాయురాలు, మూడేళ్ల పసిప్రాయం అని కూడా చూడకుండా ఒక చిన్నారిపై యాసిడ్ పోసి కిరాతకానికి ఒడిగట్టింది. ఘటన తర్వాత బాత్‌రూమ్‌లో పడిపోయిందని టీచర్ తమకు ఫోన్ చేశారని చెప్తున్నారు. దీంతో వెంటనే స్కూలు వద్దకు చేరుకుని చిన్నారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆస్పత్రి వైద్యులు యాసిడ్ దాడి జరిగినట్లు నిర్ధారించినట్లు తెలిసింది.
Read Also: Guarantees : కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం
పిల్లల భద్రతపై ఆందోళన
మరోవైపు యాసిడ్ పోయటంతో గాయాలపాలై.. చిన్నారి బాత్‌రూమ్ కూడా వెళ్లలేని స్థితిలో ఉందని చిన్నారి తల్లిదండ్రులు వాపోతున్నారు.ఈ ఘటనకు సంబంధించి చిన్నారి తల్లి చెప్తున్న వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 23వ తేదీన చిన్నారిని.. ఆమె తల్లి స్కూలు వద్ద దింపేసి వెళ్లింది. అయితే కాసేపటికే స్కూలు నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మీ పాప బాత్‌రూమ్‌లో పడిపోయిందంటూ స్కూలు టీచర్.. చిన్నారి తల్లికి సమాచారం అందించారు. వెంటనే స్కూలు వద్దకు చేరుకున్న చిన్నారి తల్లి.. పాపను ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. యాసిడ్ దాడి జరిగినట్లు తెలిపారు. దీంతో స్కూలు వద్దకు చేరుకున్న చిన్నారి తల్లిదండ్రులు.. స్కూల్ యాజమాన్యాన్ని గట్టిగా నిలదీశారు. దీంతో స్కూలు యాజమాన్యం చిన్నారి తల్లిదండ్రులతో రాజీ ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఇందుకు చిన్నారి తల్లిదండ్రులు అంగీకరించకపోవటంతో బెదిరింపులు దిగినట్లు బాధిత కుటుంబం చెప్తోంది. పోలీసులు తమకు తెలుసని.. ఈ విషయాన్ని బయటకు చెప్తే మీ అంతుచూస్తామంటూ స్కూలు ప్రిన్సిపల్ బెదిరించినట్లు చెప్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురిని గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై విద్యాధరపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు సరిగా స్పందించటం లేదని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: