Vijayawada : ఆర్టీసీ లోని అధికారుల పదోన్నతులకు మెరిట్ రేటింగ్ రిపోర్టులు (ఎంఆర్ఆర్), వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్)లను శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) సంయుక్తంగా పరిగణనలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఆర్టీసీలో పదోన్నతులకు సంబంధించి అధికారికి చెందిన ఐదేళ్ళ ఎంఆర్ఆర్ఎన్ను పరిగణనలోకి తీసుకునేవారు. ఆర్టీసి (APSRTC) ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కావడంతో… ఇతర శాఖల ప్రభుత్వ అధికారుల మాదిరిగా పదోన్నతులకు ఏసీఆర్ లు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.
Read also: AyodhyaVisit: అయోధ్యలో చంద్రబాబుకు ‘జాతీయ’ నీరాజనం
మొదటి స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతుల్లో వరుసగా నాలుగు ప్యానల్ ఇయర్స్(Four panel years) ఈ రెండింటిని కలిపి పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం
2025-26 ప్యానల్ ఇయర్ కోసం అంతకుముందు ఐదేళ్ళలో నాలుగేళ్ళ ఎంఆర్ఆర్లు ఒక ఏడాది ఏసీఆర్ను పరిగణనలోకి తీసుకుంటారు.
2026-27 ప్యానల్ ఇయర్తోమూడేళ్ళ ఎంఆర్ఆర్లు, రెండేళ్ళ ఏసీఆర్ లు చూడమన్నారు.
2027-28కి రెండేళ్ళ ఎంఆర్ఆర్లు, మూడేళ్ళ ఏసీఆర్ లు పరిగణనలోకి తీసుకుంటారు.
2028-29 ఒక ఏడాది ఎంఆర్ఆర్, నాలుగేళ్ళ ఏసీఆర్ లు చూడనున్నారు.
2029-30 ప్యానల్ ఇయర్ నుంచి మాత్రం పూర్తిగా అంతకుముందు ఐదేళ్ళ ఏసీఆర్ లనే పరిగణనలోకి తీసుకొని పదోన్నతులు ఇవ్వనున్నారు.
ఉద్యోగులకు 10 సెలవులు
ఆర్టీసీలోని విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప జోనల్ వర్క్ షాపులు, స్టోర్స్, టైర్ రిట్రెడింగ్ షాపుల్లో పనిచేసే ఉద్యోగులకు వచ్చే ఏడాది 16 సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ట్రాఫిక్, గ్యారేజి విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఐదు సెలవుల(Employee Leave Policy)ను ఖరారు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: